ప్చ్ ...పాపం, 'ఉప్పెన' కి ఆ విషయంలో దెబ్బ పడినట్లేనా ....??

GVK Writings
మెగా యంగ్ హీరో పంజా వైష్ణవ తేజ్, యువ భామ కృతి శెట్టి ల కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ఉప్పెన. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించింది. గతంలో సుకుమార్ వద్ద శిష్యుడిగా పలు సినిమాలకు పని చేసిన బుచ్చిబాబు తొలి సినిమా అయినప్పటికీ కూడా మంచి అనుభవం ఉన్న దర్శకుడి మాదిరిగా మూవీని ఎంతో బాగా తెరకెక్కించాడని, అలానే హీరో, హీరోయిన్స్ ఇద్దరితో పాటు, రాయనం పాత్రలో నటించిన విజయ్ సేతుపతి, దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మైత్రి మూవీ మేకర్స్ వారి ఎంతో భారీ నిర్మాణ విలువలు, హృద్యమైన స్టోరీ, ఎమోషనల్ క్లైమాక్స్ వంటివి ఈ మూవీ సూపర్ హిట్ కొట్టడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

ఈ మూవీ యొక్క క్లైమాక్స్ ఎంతో బాగుందని, తప్పకుండా హీరో, హీరోయిన్ అలానే దర్సకుడు బుచ్చిబాబు కు మంచి భవిష్యత్తు ఉందని పలువురు ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక తొలి రోజు తొలి ఆట నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ పై దీనికి సంబంధించి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ మూవీ చూసాను ఎంతో అద్భుతంగా ఉంది, తప్పకుండా తొలి సినిమా తో బుచ్చిబాబు రూ.100 కోట్లు కొడతాడు అంటూ జోస్యం చెప్పారు. మెగాస్టార్ కూడా సినిమాలో కథ, కథనం, ఎమోషన్స్ తప్పకుండా ఆడియన్స్ కి నచ్చి భారీ కలెక్షన్స్ అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసారు. అయితే ఇప్పటివరకు కొందరు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న వివరాల ప్రకారం ఈ మూవీ ఇప్పటివరకు రూ.73 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ అందుకుందని, ఇప్పటికే కొన్ని ఏరియాల్లో మూవీ కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయని అంటున్నారు. 

మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ మిగతా రూ.27 కోట్లు కలెక్ట్ చేస్తేనే గానీ సుకుమార్ చెప్పిన మాట నిజమవ్వదని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది జరగడం కొంత కష్టమే అయినప్పటికీ, మరికొద్దిరోజుల్లో గడిస్తేనే కానీ సినిమా పూర్తి పరిస్థితి ఎలా ఉంది అనేది చెప్పలేం అని అంటున్నారు విశ్లేషకులు. మరి ఉప్పెనకి ఆ ఫీట్ ని అందుకునే ఛాన్స్ ఉంటుందా లేక దెబ్బ పడుతుందా అనేది తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే....!! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: