కార్తీక దీపం వంటలక్క వయసెంతో తెలుసా..?

Mamatha Reddy
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే సీరియల్ ఏదన్నా ఉంది అంటే అది కార్తీక దీపం అనే చెప్పాలి. ఈ సీరియల్ ద్వారా ప్రేమి విశ్వనాధ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. వంటలక్కగా ప్రతి రోజు మనల్ని పలకరించే ప్రేమి విశ్వనాధ్ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.. !! చాలామందికి ప్రేమి విశ్వనాధ్ వయసు ఎంత ఉంటుందో అన్న అనుమానం వచ్చే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం  దొరికింది. ప్రేమి విశ్వనాథ్ మన తెలుగు అమ్మాయి కాదు.. తను పుట్టింది కేరళలో. డిసెంబర్ 2 న 1991వ సంవత్సరంలో కేరళలో జన్మించింది. అంటే ఆమెకు 28 సంవత్సరాలు అన్నమాట.ప్రేమి టీవీ ప్రపంచంలోకి రాకముందు ఎర్నాకుళంలోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసింది.  

 ప్రేమి విశ్వనాథ్ మలయాళ ఛానల్ ఏసియానెట్‌లో ప్రసారం అయినా కరుతముత్తు అనే సీరియల్ ద్వారా ఆమె అక్కడ బాగా పాపులర్ అయ్యింది. ఇదే సీరియల్‌ను ఇక్కడ కార్తీక దీపం పేరుతో తెలుగులో  రీమేక్ చేస్తున్నారు.  ఇంకా ఆమె తల్లితండ్రులు ఎవరంటే  విశ్వనాథ్, కాంచన విశ్వనాథ్ లకు జన్మించించి. ప్రేమి విశ్వానథ్ కు వివాహం కూడా జరిగింది. ఆమె భర్త పేరు డాక్టర్ టి ఎస్ వినీత్ భట్.ఆయన  అస్ట్రాలజీలో ప్రముఖుడు. ఆమెకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. పేరు శివ ప్రసాద్. ఆయనకు కేరళలో రెండు స్టూడియోలు  కూడా ఉంది.

ప్రస్తుతం ప్రేమి తన భర్తతో కలిసి ఎర్నాకుళంలో నివసిస్తోంది
మన తెలుగు తెరకు 16 అక్టోబర్ 2017 న కార్తిక దీపం సీరియల్ ద్వారా దీపగా పరిచయం అయింది. అప్పటినుంచి ఇప్పటివరకు అందరిని తన నటనతో కట్టి పడేస్తూ వస్తుంది. మొదట్లో దీప అంతగా పాపులర్ అవ్వలేదు.ఈ సీరియల్ లో దీప చూడడానికి నల్లగా కనిపిస్తుంది.. తర్వాత రాను రాను దీప రూపాన్ని పక్కన పెట్టి దీప నటనను, మనస్తత్వాన్ని ప్రేక్షకులు బాగా ఇష్ట పడ్డారు. అందం రూపంలో ఉంటే చాలదు మనసులో కూడా ఉండాలి అని దీప నిరూపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: