అప్పట్లో కన్నీళ్లు తెప్పించి, కాసుల వర్షం కురిపించిన సినిమా ఏంటో తెలుసా...!

Divya

సాధారణంగా ఒక సినిమా కథాంశం బాగుంటే,  ఆ సినిమా బ్లాక్ బస్టర్ వద్ద హిట్ గా నిలుస్తుంది. కానీ మనలో చాలా మంది ప్రేక్షకులు లవ్,మాస్,యాక్షన్ చిత్రాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తుంటారు. కానీ  అందుకు భిన్నంగా కొన్ని చిత్రాలు కేవలం సెంటిమెంటుతో కలెక్షన్స్ సునామి  సృష్టించడం చాలా అరుదు. ఇక అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా మాతృదేవోభవ. ఈ సినిమా 1993వ సంవత్సరంలో అజయ్ కుమార్ దర్శకత్వం వహించగా, కె.ఎస్.రామారావు దీన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సీనియర్ నటి మాధవి టైటిల్ రోల్ గా వ్యవహరించగా, నాజర్,తనికెళ్ల భరణి,కోట శ్రీనివాసరావు ,అల్లు రామలింగయ్య,తదితరులు కీలక పాత్రలు పోషించారు.

మలయాళంలో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా పిలిపించుకున్న ఆకాశదూతు సినిమా రీమేక్ గా మాతృదేవోభవను తెరకెక్కించారు. అంగరక్షకుడు షూటింగ్ టైంలో ఈ సినిమాను చూసిన రామారావు, తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా నచ్చుతుందని డిసైడ్ అయి ఆలస్యం చేయకుండా, ఈ సినిమాను రీమేక్ చేయడానికి కావాల్సిన అన్ని హక్కులను పొందాడు. ఇక అనుకున్నదే తడవుగా రచయిత సత్యమూర్తి తో వెంటనే స్క్రిప్టు సిద్ధం చేయించారు. ఇక ఒరిజినల్ వెర్షన్ లో చేసిన మాధవినే రీమేక్ లో కూడా నటించి, ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించింది. అంతగా ఆమె నటన ఈ చిత్రానికి అద్భుతంగా పండింది.
కీరవాణి అద్భుత సంగీతంలో వేటూరి సాహిత్యం ప్రాణం పోసుకుంది. అయితే అక్టోబర్ 22న ఎలాంటి అంచనాలు లేకుండా మాతృదేవోభవ ను విడుదల చేశారు. అయితే మొదటి వారం జనాలు పెద్దగా హాజరుకాలేదు. ఇక దీంతో హైదరాబాద్లోని థియేటర్ల యజమానులు కే ఎస్ రామారావు కి ఫోన్ చేసి రెండోవారం ఈ చిత్రాన్ని కొనసాగించడం కష్టమని తేల్చారు. ఇక మంచి సినిమాని ఎలాగైనా నిలబెట్టాలని సంకల్పంతో కొన్ని రోజులు కొనసాగించమని డిస్ట్రిబ్యూటర్లను ఒప్పించారు. ఈ సినిమాకు హాజరయ్యే ప్రేక్షకులకు కర్చీఫ్ లు  ఉచితంగా ఇస్తామని పబ్లిసిటీ కూడా చేశారు. అయితే ఇది విన్న ప్రేక్షకులు నవ్వి, దీని కథేంటో చూద్దాం పదండి అని సినిమా థియేటర్ లోకి వెళ్లారు. ఊహించని విధంగా ఇక కర్చీఫ్ లు అన్ని  తడిసి ముద్దయ్యాయి.

రియల్ లైఫ్ లో జరిగిన విధంగా మహిళలు కన్నీళ్లు పెడుతూ, మాతృదేవోభవను దీవించడం మొదలుపెట్టారు. అలా నెల రోజులు ఆడితే గొప్ప అనుకున్న సమయంలో ఏకంగా వంద రోజులు ఆడి,మాతృదేవోభవ జైత్ర యాత్ర కొనసాగింది. మొత్తం రూ.5 కోట్ల దాకా వసూలు రావడం చూసి అందరూ షాక్  అయ్యారు. ఇక ఇందులో" రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే " అనే పాట కూడా జాతీయ అవార్డు లభించింది. అలాగే ఎన్నో నంది అవార్డులు కూడా రావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: