సంక్రాంతి జాతరను మించిన శివరాత్రి సినిమాల జాతర !

Seetha Sailaja

సంక్రాంతికి లేదంటే దసరా కు సినిమాలు ఎక్కువగా విడుదల కావడం ఎప్పటి నుంచో కొనసాగుతున్న ట్రెండ్. అయితే ఎప్పుడు లేని విధంగా వచ్చేనెల మార్చి 11న రాబోతున్న శివరాత్రి రోజున ఏకంగా 6 సినిమాలు విడుదల కావడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.

సంక్రాంతి దసరా పండుగల లా శివరాత్రి పెద్ద పండుగ కాదు. జనం ఎక్కువగా గుడుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈ విషయాలను కూడ పక్కకు పెట్టి ఇప్పుడు ఏకంగా ఆరోజు 6 సినిమాలు ఏ ధైర్యంతో విడుదల చేస్తున్నారు అంటూ సినిమా విశ్లేషకులు ఆశ్చర్య పోతున్నారు.
థియేటర్స్ లో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు రావడంతో కలక్షన్స్ వరదలా వచ్చి పడతాయని ఇలా సినిమాలు అన్నీ మహాశివరాత్రిని టార్గెట్ చేస్తున్నాయి. శర్వానంద్ నటిస్తున్న ‘శ్రీకారం’ శివరాత్రి రోజున విడుదల కాబోతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన ఈమూవీకి కిశోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అదేరోజు వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రూపొందుతున్న ‘జాతిరత్నాలు’ చిత్రాన్ని కూడా విడుదల చేస్తున్నారు. ఈమూవీలో నవీన్ పోలిశెట్టి  రాహుల్ రామకృష్ణ ప్రియదర్శి ప్రధాన పాత్రలుగా నటించారు. ఈమూవీ పై కూడ అంచనాలు బాగా ఉన్నాయి. ఈ రేస్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న 'గాలి సంపత్' సినిమా కూడ రావడం హార టాపిక్ గా మారింది.  

యంగ్ హీరో శ్రీ విష్ణు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలతో రూపొందిన ఈమూవీని అనీష్ కృష్ణ చాల డిఫరెంట్ గా తీసాడు అన్న వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా కన్నడలో భారీ బడ్జెట్ సినిమాగా ప్రచారం అవుతున్న ‘రాబర్ట్’ మూవీ తెలుగు డబ్బింగ్ కూడ శివరాత్రి రోజున విడుదల కాబోతోంది. ఈ కొత్త సినిమాలతో పాటు సంక్రాంతి రేస్ కు వచ్చిన  ‘క్రాక్' సినిమాకు మిడ్ నైట్ షోలు వేసుకుంటామని చాలా మంది ఎగ్జిబిటర్స్ నుంచి రిక్వెస్టులు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి అంటే ఇంకా ‘క్రాక్’ మ్యానియా ఏవిధంగా కొనసాగుతోందో అర్థం అవుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: