మెగా హీరో కే షాక్ ఇచ్చిన మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.!!

kalpana
మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అవుతోందంటే మెగా అభిమానులకు పండగే. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత దేవీ ప్రసాద్ కాంబినేషన్లో సినిమా వస్తోందంటే బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. అల్లుడా మజాకా, ఘరానా మొగుడు, మంచి దొంగ, వంటి బ్లాక్ బస్టర్ మూవీలను నిర్మించిన దేవి ప్రసాద్ గారు ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో చిరంజీవి హీరోగా నిర్మించిన "మృగరాజు" సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.
నిర్మాత దేవీ ప్రసాద్ దాదాపు 15 కోట్ల బడ్జెట్ తో మృగరాజు సినిమా ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. 15 కోట్లు అంటే ఆ రోజుల్లో భారీ బడ్జెట్ సినిమా అని చెప్పవచ్చు. మృగరాజు సినిమా దర్శకుడు గుణశేఖర్ ఇతను  అప్పటికే చిరంజీవితో "చూడాలని ఉంది" అనే మూవీ తీసి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కారణంగానే నిర్మాత దేవి ప్రసాద్ మృగరాజు మూవీ కి అంతా బడ్జెట్ పెట్టడానికి కారణమని చెప్పుకుంటారు.
 
"మృగరాజు" మూవీ ‘ఘోస్ట్ అండ్ డార్క్ నెస్’ అనే ఇంగ్లీష్ మూవీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగు లో నిర్మించారు. ఈ సినిమాకి మొదట దర్శకునిగా జయంత్.సి.పరాన్జీ అనుకున్నారట. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు గుణశేఖర్ చేతికి వెళ్ళింది. ఈ చిత్రంలో కనిపించే జాక్ అనే సింహానికి 67 లక్షల ఖర్చు పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ దాదాపుగా 60 లక్షల ఖర్చుతో నిర్మించారట.
ఇలా ఈ స్టార్ నిర్మాత, స్టార్ డైరెక్టర్ మెగాస్టార్ కాంబినేషన్లో వస్తున్న "మృగరాజు" మూవీ భారీ అంచనాలతో  2001లో  గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీపై తెలుగు ఇండస్ట్రీలోనూ అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నప్పటికీ అనుకోని విధంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. చివరకు మృగరాజు మూవీ పెద్ద ప్లాప్ గా నిలిచి నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: