పదమూడో సారి యుద్దానికి సిద్దమయిన వెంకటేష్ - చిరంజీవి

Chaganti
రెండు మూడు రోజుల నుంచి టాలీవుడ్లో వరుసగా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా రిలీజ్ డేట్ లు అన్నీ అనౌన్స్ చేసేస్తున్నారు. అదే కోవలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా రిలీజ్ డేట్ అలాగే వెంకటేష్ హీరోగా నటిస్తున్న నారప్ప సినిమా రిలీజ్ డేట్ కూడా నిన్న ప్రకటించారు. ముందుగా నారప్ప మే 14న రిలీజ్ చేస్తున్నారని ప్రకటించగా దానికి ఒక రోజు ముందు అంటే మే 13న తాను వస్తున్నానని చిరంజీవి ప్రకటించాడు. అయితే వీరిద్దరూ ఇలా పోటాపోటీగా సినిమాలు రిలీజ్ చేయడం ఇదే మొదటి సారి కాదు. దాదాపుగా వీళ్లిద్దరూ చాలా సార్లు ఇలా పోటీ పడ్డారు. అంటే ఒక వారం గ్యాప్ లో చాలా సార్లు పోటాపోటీగా సినిమాలు రిలీజ్ చేశారు.
ముందుగా 1986 లో వెంకటేష్ కలియుగ పాండవులు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా  త్వరగా చిరంజీవి చంటబ్బాయి సినిమాతో వచ్చాడు. అదే ఏడాది బ్రహ్మ రుద్రులు అనే సినిమాతో వెంకటేష్  రాగా ధైర్యవంతుడు అనే సినిమాతో చిరంజీవి పోటీ పడ్డాడు. ఆ తర్వాత 1988లో వెంకటేష్ రక్త తిలకం అనే సినిమాతో రాగా చిరంజీవి మంచి దొంగ అనే సినిమాతో పోటీ పడ్డాడు. 1989లో వెంకటేష్ ప్రేమ అనే సినిమాతో రాగా  చిరంజీవి అత్తకి యముడు అమ్మాయికి మొగుడు అనే సినిమాతో పోటీకి దిగాడు.
ఇదే ఏడాది చిరంజీవి రుద్రనేత్ర సినిమాతో రాగా వెంకటేష్ ధ్రువ నక్షత్రం అనే సినిమాతో పోటీకి దిగాడు. ఇక 1991లో వెంకటేష్ శత్రువు అనే సినిమాతో రాగా చిరంజీవి స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ తో పోటీకి దిగాడు. మళ్లీ అదే ఏడాదిలో చిరంజీవి రౌడీ అల్లుడు అనే సినిమా రిలీజ్ చేయగా వెంకటేష్ క్షణ క్షణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక 1992లో వెంకటేష్ సుందర కాండ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా చిరంజీవి ఆపద్బాంధవుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 1994లో చిరంజీవి ఎస్ పి పరశురాం అనే సినిమా చేయగా వెంకటేష్ సూపర్ పోలీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
 ఇక 97 లో చిరంజీవి మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా వెంకటేష్ ప్రేమించుకుందాం రా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మళ్లీ 2000 సంవత్సరంలో వెంకటేష్ కలిసుందాం రా సినిమా చేయగా చిరంజీవి అన్నయ్య అనే సినిమా చేశారు. చివరిగా వీరు 2001 సంవత్సరంలో పోటీపడ్డారు వెంకటేష్ దేవి పుత్రుడు సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాగా చిరంజీవి మృగరాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఇద్దరూ పోటీ పడడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: