పుష్ప యూనిట్ కి ఏమయింది.. ఎందుకీ వరుస మరణాలు ?

Chaganti
అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ విషయంలో ఎప్పుడూ ఏవో ఒక అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. షూటింగ్ లో చాలా భాగం అడవుల్లోనే చేయాల్సి ఉండటంతో ముందు బ్యాంకాక్ అడవుల్లో షూట్ చేయాలని భావించారు. కరోనా కారణంగా నిర్మించుకున్నారు. అనంతరం కేరళ అడవుల్లో చిత్రీకరించాలని భావించినా పర్మిషన్ టెన్షన్ తో వద్దని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ చేస్తున్నారు. 

అయితే యూనిట్లో వరుసగా మరణాలు సంభవించడం ఇప్పుడు ఆ యూనిట్ కి టెన్షన్ గా మారింది. కొన్ని నెలల క్రితం మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ చేస్తున్న క్రమంలో యూనిట్ లో ఒక వ్యక్తి కరోనా బారిన  పడ్డాడు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని బయటికి అయితే రాలేదు  కానీ ఆ కారణంగా షూటింగ్ అప్పుడు నిలిపివేసి ఎవరికి వారు వెనక్కి వచ్చేశారు. తాజాగా ఈ యూనిట్లో మరో మరణం కూడా సంభవించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకి స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ గుండెపోటు కారణంగా మరణించారు.

సినిమా షూటింగ్ నడుస్తున్న సమయంలో అంతా బాగానే ఉన్నట్లు అనిపించినా ఆయనకి గుండెనొప్పి రావడంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. యూనిట్ కోసం అందుబాటులో ఉంచిన అంబులెన్స్ లో ఆయన్ని రాజమండ్రి హాస్పిటల్ తరలిస్తున్న క్రమంలో ఆయన మార్గ మధ్యంలోనే కన్నుమూశారు. తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు 250 పైగా సినిమాలకు స్టిల్ ఫొటోగ్రాఫర్గా శ్రీనివాస్ పని చేసినట్లు చెబుతున్నారు. ఇక ఈ వరుస మరణాలు పుష్ప యూనిట్ లో టెన్షన్ రేకెత్తిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: