30 సినిమాలకు సైన్ చేసిన హీరో .. ఇంత వరకు ఏ హీరో ఈ రికార్డ్ సాధించలేదు
అలాంటిది మళయాళ నటుడు పృథ్వీ రాజ్ మాత్రం వరుస సినిమాల తో దూసుకుపోతున్నాడు. అతను చేయబోయే సినిమాల లిస్ట్ వింటే .. ఆశ్చర్యపోవాల్సిందే. మొత్తం 30 సినిమాలకు ఒకే చెప్పాడట. ఇప్పుడు ఇదే విషయం సినీపరిశ్రమ లో హాట్ టాపిక్ అయ్యింది. పృథ్వీ రాజ్ ఇన్ని సినిమాలు చేస్తున్నాడా.. అంటూ అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. అదంతా అబద్ధం లే అన్నవాళ్లూ లేకపోలేదు. అయితే నిజమేనంటున్నాయి పరిశ్రమ వర్గాలు. 30 సినిమాలకు కమిట్ అవ్వడమేకాదు.. కొన్ని సినిమాలకు టైటిల్ ఫిక్స్ అయ్యాయి. మరి కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. కొన్నింటికయితే కాల్షీట్స్ కూడా ఇచ్చేశాడు. వీటిల్లో ఏ ఒక్క సినిమాను వదిిిలే ఛాన్సే లేదంటున్నాడు పృథ్వీరాజ్. మొత్తం 30 సినిమాల్లో ఈ ఏడాది కనీసం 10 సినిమాలైనా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరి పృధ్వీరాజ్ రికార్డ్ బీట్ చేసే వాళ్లు ఎవరైనా ఉన్నారా.. చూడాలి ..