ఆహా కు రవితేజ ఊతం !

Seetha Sailaja
సంక్రాంతి రేసులో రవితేజా విజేతగా నిలవడంతో మాస్ మహారాజ కు పూర్వ వైభవం తిరిగి వచ్చినట్లు అయింది. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల పోటీని తట్టుకుని ఈమూవీ కలక్షన్స్ స్టడీగా కొనసాగుతూ ఉండటంతో ఈమూవీ సూపర్ హిట్ దశగా చేరుకునే అవకాశాలు ఉన్నాయి అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక ఇది యిలా ఉండగా ఈ సినిమా డిజిటల్ హక్కులు ఎవరు దక్కించుకున్నారనే టాక్ నడుస్తోంది. ఈమూవీ ఫలితం గురించి ముందుగా అంచనాలు లేకపోవడంతో ఈమూవీ డిజిటల్ హక్కులు అమ్మకం జరగలేదు అని తెలుస్తోంది. ఇప్పుడు ఈమూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అల్లు అరవింద్ తన ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం చాల ముందుగా బుక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ విడుదలైన 50 రోజుల తరువాత ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది అంటున్నారు. ఇప్పటివరకు డబ్బింగ్ సినిమాలు చిన్నచిన్న సినిమాలకు చిరునామాగా కొనసాగుతున్న ఆహా ‘క్రాక్’ మూవీతో పెద్ద సినిమాల వైపు అడుగులు వేస్తున్నట్లు అనుకోవాలి.

వరుస ఎలివేషన్ సీన్లతో గోపీచంద్ మలినేని రవితేజను బాగా డీల్ చేయడంతో ఈ మూవీకి హిట్ టాక్ వచ్చింది. ఇప్పటివరకు వరస ఫెయిల్యూర్ లతో ఉన్న రవితేజాకు ఈమూవీ ఊహించని ఘనవిజయం. ఇది ఇలా ఉండగా ఈమూవీలో పారితోషికంగా ఈ మూవీ నిర్మాతలు నైజాం వైజాగ్ ఏరియాల హక్కులను ఇవ్వడంతో మాస్ మహారాజకు ఈ రెండు ఏరియాల బిజినెస్ వల్ల 12 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది అన్న ప్రచారం జరుగుతోంది. ‘రెడ్’ ఊహించని పరాజయం ‘మాష్టర్’ మూవీ అంచనాలను అందుకోలేక పోవడంతో పాటు బెల్లంకొండ శ్రీను ‘అల్లుడు అదుర్స్’ ఫ్లాప్ కావడంతో రవితేజా ‘క్రాక్’ కు ఇక ఎదురులేక పోయింది. ఈ మూవీ రీమేక్ కోసం అప్పుడే  బాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తున్నాయి అంటే  మాస్ మహారాజ దశ ఏవిదం గా సుడి తిరిగిందో అర్ధం అవుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: