వామ్మో ..... ఒక్కవారం లో ఇంత విధ్వంశమా .....??

GVK Writings
కొన్ని నెలల అనంతరం సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఆనందకరమైన వాతావరణం నెలకొందని అంటున్నారు విశ్లేషకులు. దానికి కారణం ఇటీవల థియేటర్స్ పూర్తిగా తెరుచుకుని వరుసగా ఒక్కొక్కటిగా సినిమాలు విడుదల అవ్వడమే అని వారు అంటున్నారు. ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా టాలీవుడ్ లో మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వగా వాటిలో మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కిన క్రాక్ సినిమా ప్రస్తుతం అన్నికంటే ఒకింత భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.
మంచి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రేక్షకాభిమానులని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించిన ఈ సినిమాలో రవితేజ, పోతురాజు వీరశంకర్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా శృతి హాసన్ ఆయనకు జోడీగా నటించింది. ఈ సినిమాకి థమన్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఇక మాస్ మహారాజ అద్భుత నటన, విలన్ పాత్రలో నటించిన సముద్రఖని, లేడీ విలన్ వరలక్ష్మి శరత్ కుమార్ లు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి కనబరిచిన నటనకు అందరి నుండి మంచి ప్రశంశలు దక్కుతున్నాయి. మొత్తంగా సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ దక్కించుకుని ప్రస్తుతం దుమ్మురేపుతూ కొనసాగుతోంది.
ఇక నిన్నటితో మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటివరకు మొత్తంగా రూ.22 కోట్ల మేర కలెక్షన్ ని దక్కించుకుని బ్రేక్ ఈవెన్ ని సునాయాసంగా దాటేసిందని, ఇకపై ఈ సినిమాకి వచ్చే వసూళ్లన్నీ కూడా లాభాలే అంటున్నారు విశ్లేషకులు. కాగా ఎప్పటినుండో సరైన సక్సెస్ కోసం పరితపిస్తున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు ఈ మూవీ ద్వారా మంచి సక్సెస్ ని దక్కించుకున్నారు. ఇక ప్రస్తుతం రవితేజ ఫ్యాన్స్ అయితే తమ హీరోకి దక్కిన ఈ అద్భుత విజయంతో అమితానందాన్ని వ్యక్తం చేస్తున్నారు.......!!  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: