సంక్రాంతి బరిలో "ఐటమ్ సాంగ్స్ " !! అదరహో అంటున్న ప్రేక్షకులు...

kalpana
తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ సంక్రాంతికి భారీ అంచనాలతో, విభిన్న కథలతో సంక్రాంతి బరిలో దిగిన సినిమాలు "క్రాక్" , "రెడ్" , "అల్లుడు అదుర్స్'. ఈ సినిమాలపై తెలుగు ప్రేక్షకుల్లో మొదటినుంచి భారీ అంచనాలే ఉన్నాయి . ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగానే  సంక్రాంతి బరిలో ఉన్న మూడు సినిమాలు విజయ పరంపరలో దూసుకుపోతున్నాయి. కలెక్షన్  పరంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేశాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే ! మన తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ ఉండటం మామూలే. అయితే సంక్రాంతి బరిలో ఉన్న మూడు సినిమాల్లోనూ ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఈ మూడు సినిమాల్లోనూ ఐటమ్ సాంగ్స్  ప్రేక్షకులను థియేటర్లలో  ఉర్రూతలూగించాయి.

"క్రాక్ " మూవీలో మాస్ మహారాజ్ రవితేజ ,అప్సర రాణి  కలిసి చిందేసిన  ఐటమ్ సాంగ్ ప్రేక్షకులను మెప్పించి, రవితేజ స్టెప్స్ , అప్సర రాణి గ్రామర్ ప్రేక్షకులను మైమరిపించారు.
ఎనర్జిటిక్ హీరో  రామ్ తో , గ్లామర్ హీరోయిన్ హెబ్బా పటేల్  ఆడిపాడిన స్పెషల్ సాంగ్ సినిమా ధియేటర్లో కేరింతల వర్షం కురిపించింది హెబ్బా పటేల్ తన అందంతో కుర్రకారుని ఆకట్టుకోగలిగింది.
 బిగ్ బాస్ సీజన్ 4 బ్యూటీ మోనాల్ గజ్జర్.( రంభ ఊర్వశి మేనక అందర్నీ కలిపితే నేనిక అంటూ .). అనే ఐటమ్  సాంగ్ లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసు కొల్లగొట్టింది.
ఏదేమైనప్పటికీ సినిమా విజయం తో సంబంధం లేకుండా ఈ మూడు సినిమాల్లో వచ్చిన ఐటమ్ సాంగ్స్ కుర్రకారుని సంక్రాంతి సంబరాలతో ఉర్రూతలూగించాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
                                                                                                                                                                                                                                                       

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: