ట్రెండింగ్ లో "వకీల్ సాబ్ "మ్యానియా ..!!

KISHORE

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత "వకీల్ సాబ్ " సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సంక్రాంతి కానుకగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ టీజర్ విడదలైన కొన్ని నిముషాల్లోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. .

అయితే టీజర్ లో పవన్ అగ్రెసివ్ గా కనిపిస్తూ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. దీంతో 'వకీల్ సాబ్ " టీజర్ కు సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది. రియల్ టైం వ్యూస్ లో భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో నెంబర్ ఒన్ ట్రెండింగ్ గా నిలిచింది. ఆ మధ్య వచ్చిన మోషన్ పోస్టర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్ అంతకు మించి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. 

ఇప్పటి వరకు 8 మిలియన్ కు పైగా వ్యూస్ మరియు 7 లక్షలకు పైగా లైక్స్ తో పవన్ కెరీర్ లో హైయెస్ట్ గా నిలిచింది. మరి ఇది ఫుల్ టైం లో ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించారు. అలాగే దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు. మరి ఈ సినిమాతో పవన్ రీఎంట్రీ లో ఎలా అలరిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: