క్యూ కడుతున్న సినిమాలు దేనికి సంకేతం !

Seetha Sailaja
తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు ఇంకా పెద్ద సంఖ్యలోనే నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికి సుమారు 20 వేల స్థాయిలో అన్ని రాష్ట్రాలలోను కరోనా కేసుల హడావిడి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో కరోనా జనాన్ని ఇంకా పూర్తిగా విడిచి పెట్టలేదు అన్న సంకేతాలు వస్తున్నాయి. అయితే ఈ విషయాలను జనం ఏమి పట్టించుకున్తున్నట్లు కనిపించడంలేదు.

దీనికి ప్రత్యక్ష ఉదాహరణ సంక్రాంతి సినిమాలకు క్యూ కడుతున్న జనం. కరోనా పరిస్థితులు వల్ల జనం వస్తారా రారా అన్న అనుమానాలు పటాపంచలు చేస్తూ సంక్రాంతి సినిమాలు అన్నింటికీ ఓపెనింగ్ కలక్షన్స్ బాగా రావడంతో నిర్మాతలు మంచి జోష్ మీద ఉన్నారు.

జనం ఓటీటీ లను పక్కకు పెట్టి ధియేటర్లకు రావడానికి ఉత్సాహం చూపెడుతున్న పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఇప్పుడు చాల సినిమాలు ఇదే నెలలో విడుదల కావడానికి క్యూ కడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  తెలుస్తున్న సమాచారం మేరకు ఈ 23న అల్లరి నరేష్ ‘బంగారు బుల్లోడు’ 29న ప్రదీప్ మాచిరాజు ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ప్రశాంత్ వర్మ  జాంబిరెడ్డి సినిమాలు డేట్ లు ప్రకటించాయి.

ఫిబ్రవరిలో నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ అదేవిధంగా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ మూవీతో పాటు మరికొన్ని సినిమాలు క్యూ కడుతున్నట్లు సమాచారం. ఇక మార్చినెల అంతా ఇప్పటికే ఫుల్ అయిపోయిందని తెలుస్తోంది. ఇక ఏప్రియల్ లో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ నితిన్ ‘రంగ్ దే’ సినిమాలతో పాటు ఇంకా చాలామంది హీరోల సినిమాలు క్యూలో ఉన్నాయి. సంక్రాంతి సీజన్ ఇచ్చిన జోష్ తో ఇప్పుడు ఈ సినిమాలు అన్నీ క్యూ కడుతున్న పరిస్థితులలో ధియేటర్లు ఆసినిమాలకు సంబంధించి మొదటివారం జనంతో నిండినా రెండవ  వారం వచ్చేసరికి జనం తగ్గిపోతారేమో అన్న భయం గత నెల విడుదలై హిట్ టాక్ తెచ్చుకుని కలక్షన్స్ విషయంలో రెండవ వారం చతికల పడ్డ సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ చెప్పిన సందేశం ఏమిటి అంటూ సినిమాల విడుదల విషయంలో ఇండస్ట్రీ వర్గాలు కన్ఫ్యూజ్ అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: