సంక్రాంతి అల్లుడు కి ఏమైంది.. అసలేంటి పంచాయితీ..?

P.Nishanth Kumar
బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం నటించిన సినిమా అల్లుడు అదుర్స్. నభ నటేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇప్పటికే ఈ సినిమా కి సంబందించిన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రాగ సినిమా పై మంచి అంచనాలను ఏర్పరిచాయి.. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ఈమధ్య విడుదల అయినా ఒలాంచిక పాట సూపర్ హిట్ గా నిలిచింది.. తొలి సినిమా నుంచి మంచి హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ కి ఈ సినిమా హిట్ ఇస్తుందా చూడాలి.
ఇక సంక్రాంతి కి అల్లుడు రాక విషయంలో ఇప్పుడు గందరగోళం నెలకొంది.  ఇప్పటికే రవితేజ ట్రాక్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. టాక్ కూడా బాగుంది. తమిళ్ స్టార్ విజయ్ ‘మాస్టర్’ 13న విడుదలకు రెడీ అవుతోంది. 14న రామ్ సినిమా ‘రెడ్’ రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ సినిమా రిలీజ్ 15న ప్లాన్ చేశారు. అయితే.. బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ సినిమాను ఒక రోజు ముందుకు జరుపాలని నిర్ణయించడంతో పంచాయితీ మొదలైంది. ఈ సినిమాను 14వ తేదీనే విడుదలకు రెడీ చేస్తున్నారు. ఈ విషయాన్ని అడియో ఫంక్షన్ లో అధికారికంగా అనౌన్స్ చేయాలని చూస్తున్నారట.
అయితే.. ఉన్నట్టుండి డేట్ మార్చడంపై మిగిలిన సినిమాల జనాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రామ్ రెడ్ కూడా 14వ తేదీనే రిలీజ్ అవుతుండడంతో.. రెండు సినిమాలూ ఒకే రోజు విడుదలైతే కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.అల్లుడు అదుర్స్ సినిమా సడెన్ గా సంక్రాంతి బరిలోకి రావడమే గాకుండా.. ఇప్పుడు సడెన్ గా డేట్ మారుస్తున్నారనే అభ్యంతరాలు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ముందుకు వచ్చినట్లు సమాచారం. అక్కడ డిస్ట్రిబ్యూటర్లతో పంచాయతీ నడుస్తోందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: