హీరోయిన్ అవుతుందనుకున్న రోజా కూతురు ఎవరు ఊహించని రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది

Mamatha Reddy
ఆర్. కే రోజా సెల్వమణి కి అన్షు మల్లికా, కృష్ణ లోహిత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోజా సినిమాల్లో అగ్రతారగా కొనసాగిన విషయం తెలిసిందే. ఆమె రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ఆమె పట్టిందల్లా బంగారమే అని చాలామంది అంటుంటారు. అయితే రోజా గారాలపట్టి అన్షుమల్లికా కూడా తనకు ఇష్టమైన రంగంలో అడుగుపెట్టి విజయం సాధిస్తోంది. ఆమెకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇంతకీ రోజా ముద్దుబిడ్డ అన్షు మల్లికా అడుగుపెట్టిన రంగం ఏమిటంటే.. సాహిత్యం. సాధారణంగా సాహిత్యంలో ప్రావీణ్యం పొందాలంటే పుట్టుకతోనే ఏదో ఒక భాష పై చాలా పట్టు ఉండాలి. అలాగే క్రియేటివిటీ పుష్కలంగా ఉండాలి. ఆత్మశోధన చేసుకొనే సామర్థ్యం ఉండాలి. అప్పుడే ఒకరు రాసే సాహిత్యాన్ని ఇతరులు ఆస్వాదించగలుగుతున్నారు.
రోజా కుమార్తె అన్షుమల్లికా తన చిన్న వయసులోనే ఏకంగా ఒక పుస్తకం రాసి.. ఎంతో మంది రీడర్స్ ని ఆశ్చర్యపరిచింది. షిఫ్టింగ్ పర్సిప్షన్స్ పేరిట ఆమె ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేసింది. గూగుల్ ప్లే బుక్స్ అప్లికేషన్ లో ఈ-బుక్ సెక్షన్ లో "షిఫ్టింగ్ పర్సిప్షన్స్ బై మల్లికా రోజా సెల్వమణి" అని శోధిస్తే అన్షుమల్లికా యొక్క పీస్ ఆఫ్ రైటింగ్ మనం చదువుకోవచ్చు. ఈ పుస్తకంలో వేర్వేరు ప్రదేశాలనుంచి ప్రముఖ రచయితలు విభిన్నమైన అంశాలపై తమ ఆలోచనలను వెల్లడించారు. ఈ పుస్తకంలో ఉత్తమమైన ఆలోచనలను అన్షు మల్లిక కంపైల్ చేసి పాఠకులకు అందించింది.
ఈ పుస్తకం రాయకముందే అన్షు మల్లిక వివేకానంద యూత్ పార్లమెంటరీ నుంచి ఇన్నోవేటివ్ రైటర్ అవార్డు కూడా అందుకుంది. హృదయాన్ని హత్తుకునే విధంగా ఆమె తన భావాలను అక్షరరూపంలో తెలియజేయగలదు. ఆర్ కే రోజా తన కూతురిని ప్రోత్సహిస్తే ఆమె భారతదేశంలో ప్రముఖ రచయితలలో ఒకరు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పాఠకులు చెబుతున్నారు. రోజా కుమార్తె సరస్వతీ పుత్రిక లాగా చిన్నప్పుడే సాహిత్యంలో పట్టు సాధించడం తో ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: