టాలీవుడ్ లిరిక్ రైటర్ వెన్నెలకంటి మృతి

Malathiputhra
ప్రముఖ నటుడు వెన్నెల కంటి మరణించారు .. అయన స్వస్థలం నెల్లూరు.. తెలుగు వారే అయినా వెన్నెల కంటి ఇటు తెలుగు లో మరియు తమిళ్ అనువాద తెలుగు సినిమాలలో పాటలని రాసారు .. టాలీవుడ్ లోని ఎంతోమంది నటులకి అయన పాటలని రాసారు .. శ్రీ రామచంద్రుడు  అనే సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు .. అటు తర్వాత పేరున్న డైరెక్టర్ చిత్రాలలో అయన పాటలు వచ్చాయి .. వంశీ తెరకెక్కించిన మహర్షి సినిమాలో మాట రాణి మౌనమిది అనే పాట సూపర్ హిట్ అయ్యింది .. అలాగే ఆదిత్య 369  , సమరసింహా నాయుడు , క్రిమినల్ , శీను వంటి చిత్రాలలో అయన పాటలు రాసారు ..
వెన్నెలకంటి మృతి చెందడంతో  టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు .. సినిమాలకు పాటలతో పాటు మాటలను కూడా అందించారు .. వెన్నెలకంటి సినిమాల్లోకి రాకముందు బ్యాంకు ఉద్యోగిగా పని చేసారు .. అటు తర్వాత ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహం తో సినిమా రంగం లోకి అడుగుపెట్టారు .. ఆలా సినిమాల్లోకి అడుగు పెట్టిన వెన్నెలకంటి సుమారు  రెండువేల పాటలు  రాసారు ..  అయన శ్రీరామచంద్రుడు సినిమా లో మొదటగా రాయగా ,చివరి చిత్రమైన పెంగ్విన్ లో రాసారు .. అంతేకాదు కమల్ హాసన్ గారి కొన్ని తెలుగు అనువాద చిత్రాల్లోనూ పాటలు రాసారు .. అలాగే దశావతారం , పంచతత్రం వంటి చిత్రాలకు మాటలను కూడా రాసారు  ..
ఇక వెన్నెలకంటి కి భార్య ,ఇద్దరు కుమారులు ఉన్నారు .. పెద్ద కుమారుడు శశాంక్ వెన్నెలకంటి పలు తమిళ్ చిత్రాలకు మాటలను రాయగా , చిన్న కుమారుడు రాకేందు మౌళి కూడా సింగర్ , లిరిక్ రైటర్ మరియు హీరోలు కొన్ని చిత్రాల్లో కూడా నటించారు  .. ఇక తన ఇద్దరు కుమారులు కూడా సినిమా రంగం లోను రాణిస్తుండడం  విశేషం ..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: