గుర్తు పట్టకుండా మారిపోయిన చందమామ హీరోయిన్ సింధు మీనన్

Mamatha Reddy
ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే ఒకానొక టైమ్ కొచ్చేసరికి అవకాశాలు తగ్గిపోవడం మామూలే. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి కొత్త హీరోయిన్స్ వచ్చినప్పుడు, పాత హీరోయిన్స్ లగేజ్ ప్యాక్ చేసుకుని ఇంటికి వెళ్లిపోవడం అనేది కామన్. అయితే అదృష్టమో, అందమో కొంతమందినీ ఇంకా ఇండస్ట్రీలో నిలబడేలా చేస్తుంది.నిలబడలేనివారు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక ఎందుకు అనుకునేవాళ్ళు బిజినెస్ చేసుకోవడమో, లేదా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవడమో చేస్తుంటారు. ఇలా చాలా మంది యాక్టింగ్ ను వదిలేసి పెళ్లిళ్లు చేసుకున్నారు. వారిలో సింధుమీనన్ ఒకరు. ఈమె చందమామ, వైశాలి వంటి సినిమాలతో బాగా పాపులర్ అయిన నటి. ఈమె మలయాళీ కుటుంబంలో జన్మించారు. మాతృభాష మలయాళం అయినప్పటికీ, ఈమె బెంగుళూరులోనే పుట్టి పెరిగారు. సింధు మీనన్ చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకున్నారు. చిన్న వయసులోనే డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి విజేతగా నిలిచారు. ఆ సమయంలో ఆ డాన్స్ కాంపిటీషన్ కి జడ్జ్ గా ఉన్న భాస్కర్ అనే వ్యక్తి, సింధు మీనన్ ను కన్నడ డైరెక్టర్ కె.వి.జయరాం కు పరిచయం చేశారు.

అలా 1994 లో జయరాం డైరెక్షన్ లో వచ్చిన రాశ్మీ అనే కన్నడ సినిమా ద్వారా బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన సింధు మీనన్, 1999 లో ప్రేమ ప్రేమ ప్రేమ అనే కన్నడ సినిమాలో హీరోయిన్ గా నటించారు. 2001 లో రియల్ స్టార్ శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. త్రినేత్రం, శ్రీరామచంద్రులు, ఇన్స్పెక్టర్, ఆడంతే అదో టైపు, చందమామ, రెయిన్ బో, సిద్ధం, ప్రేమ పిలుస్తోంది, సుభద్ర సినిమాల్లో నటించారు. చందమామ, వైశాలి సినిమాలతో ఈమెకు మంచి పేరు వచ్చింది. వైశాలి సినిమాలో ఈమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కన్నడ, మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. మలయాళంలో వంశం అనే సీరియల్ లో కూడా నటించారు. పలు టి‌వి షోస్ కి హోస్ట్ గా కూడా చేశారు. 2010 ఏప్రిల్ లో యుకెలో నివసించే ఐటీ ప్రొఫెషనల్ డొమినిక్ ప్రభును వివాహం చేసుకుని హౌజ్ వైఫ్ గా సెటిల్ అయ్యారు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. ప్రస్తుతం వీరి ఫ్యామిలికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: