సంక్రాంతి రేసులో ఆ సినిమాలు..!

NAGARJUNA NAKKA
సంక్రాంతి సీజన్ కు ఇంకా 20రోజులే ఉంది. ఈ రేస్ నుంచి వకీల్ సాబ్ తప్పుకున్నా క్రాక్, రంగ్ దే, మాస్టర్, రైడ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటి సినిమాలున్నాయి. సంక్రాంతి దగ్గర పడుతున్నా.. ఈ సినిమాల్లో ఒక్క రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు. దీంతో ఈ సారి సంక్రాంతి సీజన్ ఉంటుందా.. అనే డౌట్ వస్తోంది. పండుగ కన్ఫ్యూజన్ లో అందరూ ఉంటే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన ఫస్ట్ మూవీ క్రాక్.
సంక్రాంతికి వస్తున్నామంటూ రంగ్ దే, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ నిర్మాతలు ఎనౌన్స్ చేశారు. ఫిఫ్టీ పర్సంట్ ఆక్యుపెన్సీతో వర్కవుట్ కాదని కొందరు థియేటర్స్ కు జనాలు వస్తారా.. రారా డౌట్ తో మరికొందరు వెయిట్ చేస్తున్నారు. క్రేజీ మూవీ ఒక్కటైనా రిలీజ్ అయితే గానీ వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు. కాస్తో గొప్పో క్రేజ్ ఉన్న సోలో బతుకే సో బెటర్ ఈ నెల 25వ రిలీజ్ అవుతోంది. దీని రిజల్ట్ ఎలా ఉంటుంది. ప్రేక్షకుల మైండ్ సెట్ ఎలా ఉందో చూసి సంక్రాంతికి వద్దామా లేదా అని మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్, రెడ్ నిర్మాతలు ఆలోచిస్తారట.
ఈ గోలంతా ఎందుకని నితిన్ వెనక్కి తగ్గాడు. కీర్తి సురేష్ తో జత కడుతున్న రంగ్ దే సంక్రాంతికి వచ్చే అవకాశం లేదు. ఎవరు వచ్చినా రాకపోయినా క్రాక్ డేర్ చేసేశాడు. రవితేజ, శృతిహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ రూపొందుతోంది. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేసి ప్రమోషన్ పెంచిన క్రాక్ జనవరి 14న వస్తున్నట్టు ఎనౌన్స్ చేశాడు. దర్శకుడు సోషల్ మీడియాలో క్రాక్ ఆన్ జాన్ 14 అని పెట్టడంతో ఆ సినిమా డేట్ కన్ఫార్మ్ అయిపోయింది.
రెడ్, అరణ్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వద్దామా లేదా అనే కన్ ఫ్యూజన్ లో ఉంటే డబ్బింగ్ మూవీ మాస్టర్.. 8న రావాలన్న ప్లాన్ లో ఉన్నాడు. పండుగకు ఓ వారం ముందే వచ్చి కలెక్షన్స్ దోచేయాలి అనేది మాస్టర్ స్కెచ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: