అనుష్క-షారుఖ్ ప్రేమకథకు 12ఏళ్ళు

Naga Sai Ramya
షారుఖ్ ఖాన్ అలాగే అనుష్క శర్మ కలిసి నటించిన "రబ్ నే బనా ది జోడీ" సినిమాకు నేటితో 12 ఏళ్ళు నిండుతాయి. ఈ సినిమాతోనే అనుష్క శర్మ బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ లవ్ డ్రామాను ఆదిత్య చోప్రా డైరెక్ట్ చేశాడు. ఇందులో సురేందర్ అనే సాధారణ యువకుడి పాత్రలో షారుఖ్ నటించాడు. సాదాసీదాగా ఉండే ఈ వ్యక్తి తన భార్య ప్రేమను పొందేందుకు రాజ్ గా మారతాడు. సురేందర్ భార్య తానీగా అనుష్క శర్మ నటించింది. అనుకోని పరిస్థితుల్లో వీరి వివాహం జరుగుతుంది. అరేంజ్డ్ మ్యారేజ్ లో అడ్జస్ట్ అవడం తానీకి ఇబ్బందిగా ఉంటుంది.

ఆమె మనసు గెలవాలని రాజ్ గా మారిన సురేందర్ ప్రయత్నిస్తాడు. ఒకానొక క్షణంలో రాజ్ ను తానీ ఇష్టపడుతోందని తెలిసి సురేందర్ బాధపడతాడు. కానీ, సురేందర్ నే తానీ ఇష్టపడుతోందని తెలుసుకుని సంతోషిస్తాడు. తన డ్యాన్స్ పార్ట్నర్ రాజ్ గా తనతో ఇన్నాళ్లు డ్యాన్స్ చేసింది సురేందర్ అని తెలిసి తాని షాకవుతుంది. ఇలా ఎన్నో ట్విస్టులతో ఈ సినిమా ఆకట్టుకుంది.
ఈ సినిమా చాలా చక్కటి మెసేజ్ ను అందిస్తుంది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వ్యక్తులను యాక్సెప్ట్ చేయాలన్న కాన్సెప్ట్ ను ఇందులో హైలైట్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. లీడ్ పెయిర్ యొక్క అద్భుతమైన కెమిస్ట్రీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.  ఈ సినిమాలో నటించే సమయానికి అనుష్క వయసు కేవలం 20 సంవత్సరాలు. ఈ సినిమాలో అనుష్క కనబరిచిన కాన్ఫిడెంట్ యాక్టింగ్ అనేది ఆమెకు విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టింది. ఈ సినిమా విడుదలైన మరుసటి రోజే ఈ సినిమా స్క్రిప్ట్ ను అకాడెమి ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వారి  మార్గరెట్ హెరిక్ లైబ్రరీలో పొందుపరిచారు. అంతటి పాపులారిటీను ఈ సినిమా సొంతం చేసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: