ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 4 ప్రస్తుతం 14వ వారానికి చేరుకొని ఆకట్టుకుంటూ కొనసాగుతోంది. ఇకపోతే ఇటీవల రేస్ టూ ఫినాలే మెడల్ ని గెలుచుకుని డైరెక్ట్ గా ఫైనల్ కి వెళ్ళిపోయిన అఖిల్ మినహా హౌస్ లో ఉన్న అభిజీత్, మోనాల్, హారిక, అరియనా, సోహెల్ అందరూ కూడా ఈవారం ఎలిమినేషన్ జోన్ లో నిలిచినట్లుగా బిగ్ బాస్ ప్రకటించారు. ఇక అక్కడి నుండి ఈ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అయి బయటకు వెళ్తారు అనే దానిపై ప్రేక్షకులు, బిగ్ బాస్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది అనే చెప్పాలి.
నిజానికి ఈ వారం మొదటి మూడు రోజులు మోనాల్ హవా కొనసాగిందని, మరోవైపు అఖిల్ ఈ వారం ఎలిమినేషన్ లో లేకపోవడంతో ఆయన ఫ్రెండ్ అయిన మోనాల్ కి పలువురు అఖిల్ ఫ్యాన్స్ భారీగా ఓట్లు వేసినట్లు సమాచారం. దానితో ఆమె మొదటి మూడు రోజులు దూసుకుపోయిందని అంటున్నారు. అయితే చివరి రెండు రోజులు అయిన గురు, శుక్రవారాలు రెండు రోజులు హారిక కి అనూహ్యంగా వోటింగ్ పెరిగిందని చెప్తున్నారు.
దానికి కారణం ఆమె ముందు మూడు రోజులు వెనుకబడిందని గ్రహించిన ఆమె ఫ్యామిలీ మెంబెర్స్ అలానే ఫ్రెండ్స్ పలువురు మీడియా సెలెబ్రిటీలతో ప్రచారం చేయించారని, అలానే నిన్న జరిగిన డ్యాన్సింగ్ ఎపిసోడ్ లో మోనాల్ కోసం గోల్డెన్ మైక్ త్యాగం చేయడం హరికకి బాగా కలిసి వచ్చిందని చెప్తున్నారు. మొత్తంగా ఇదంతా చూసుకుంటే ఈ వారం హౌస్ నుండి ఎక్కువ శాతం మోనాల్ బయటకు వెళ్లే ఛాన్స్ కనపడుతోందని తెలుస్తోంది. అయితే పక్కాగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే మాత్రం మరొక్క రోజు వెయిట్ చేయాల్సిందే....!!