1 నిముషం పాటు లిప్ లాక్ ఇచ్చేసింది

E. Rama Krishna
బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ హైదర్. హైదర్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ బయటకు రిలీజ్ అయింది. ఈ మూవీలో హీరోహీరోయిన్స్ మధ్య దాదాపు 1 నిముషం పాటు లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. అయితే ఇటువంటి సీన్స్ బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా కామన్. కాని వరుసగా లిప్ లాక్ సీన్స్ లో నటించే హీరోయిన్ పైనే ఇప్పుడు అందరి ద్రుష్టి పడింది. హైదర్ మూవీలో శ్రద్ధా కపూర్, షాహిద్ కపూర్ సరసన నటిస్తుంది. బాలీవుడ్ లో లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న షాహిద్ కపూర్ తన లేటెస్ట్ మూవీ ‘హైదర్' చిత్రం కోసం గుండుతో కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. షాహిద్ కపూర్ ని ఇలా గుండుతోనూ, గుబురు గడ్డం లుక్ తో చూసిన అంతా ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా లేడీ అభిమానులు షాహిద్‌ను ఈ లుక్‌లో చూసి భరించలేక పోతున్నారు. ఇదిలా ఉంటే హీరోయిన్ శ్రద్ధా కపూర్, షాహిద్ తో ఈ మూవీలో తెగ రొమాన్స్ చేసిందట. ఓ సీన్ లో షాహిద్ కి ఏకంగా ఒక నిముషం పాటు లిప్ లాక్ ఇచ్చేసి, కేక పుట్టించిందట. ఈ మద్య కాలంలో శ్రద్ధా కపూర్ నటిస్తున్న ప్రతి మూవీలో ఈ హీరోతో లిప్ లాక్ సీన్ అనేది వెరీ కామన్ అయింది. హీరోతో లిప్ లాక్ సీన్ లేకపోతే, తనే దర్శకుడిని అడిగి మరీ ఆ సీన్ న్ పెట్టించుకుంటుందట. శ్రద్ధా కపూర్ కి ఉన్న ఈ అలావాటుకి హీరోలు తెగ ఎంజాయ్ చేస్తున్నట్టుగా బిటౌన్ అంటుంది. అయితే హైదర్ సినిమా చేస్తున్నందుకు షాహిద్ కపూర్ చాలా గర్వంగా ఫీలవుతున్నాడు. షేక్స్ పియర్ డ్రామా ‘హామ్లెట్' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: