కరోనా కు కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్న డిస్ట్రిబ్యూటర్స్ !

Seetha Sailaja

పండుగ వచ్చిందంటే కొత్త సినిమాల సందడి మొదలవుతుంది. థియేటర్స్ అన్నీ హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతూ కనిపించేవి.  అయితే ఇప్పుడు కరోనా పరిస్థితులతో ధియేటర్లు అన్నీ మూత పడటంతో గడిచిన దసరా తో పాటు రాబోతున్న దీపావళి కూడ సినిమాల విడుదల సందడి లేకుండానే ముగిసి పోతోంది.

ఇలాంటి పరిస్థితులలో జనం పూర్తిగా మారిపోయి ఇంట్లోనే కూర్చుని ఓటీటీ లో విడుదలయ్యే సినిమాలను చూస్తూ కాలం గడిపేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఓటీటీ లో ‘మిస్ ఇండియా’ రిలీజ్ అయితే నేడు 'గతం' అనే సైకో థ్రిల్లర్ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నారు. నవంబరు 12న హీరో సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా' సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

‘Rx 100' బ్యూటీ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ చైతన్య కృష్ణ లు నటించిన 'అనగనగా ఓ అతిథి'  సినిమా 'ఆహా' లో నవంబరు 13న విడుదల కాబోతోంది. నవంబర్ 14న సిద్ధు జొన్నలగడ్డ సీరత్ కపూర్ జంటగా నటించిన ‘మా వింత గాధ వినుమా' సినిమా కూడా ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది. ఇది చాలదు అన్నట్లుగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన 'అమ్మోరు తల్లి' నవంబరు 14న డిస్నీ+హాట్ స్టార్ లో రిలీజ్ అవుతోంది. విజయ్ దేవరకొండ తమ్మడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమా కూడ ఈ నెలలోనే విడుదల కాబోతున్నాయి.

ఇవే కాకుండా ఇంకా అనేక సినిమాలు ఓటీటీ లో ఈనెల విడుదల కాబోతున్నాయి. కరోనా కారణంగా ధియేటర్లలో విడుదల కావలసిన సినిమాలు అన్నీ ఓటీటీ బాట పట్టడంతో లాభపడింది డిస్ట్రిబ్యూటర్స్ అని అంటున్నారు. గత 6 నెలలుగా ఓటీటీ లో విడుదల అవుతున్న ఏ సినిమా విజయవంతం కాలేదు. ఈ సినిమాలు అన్నీ డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కుని ఉంటే ఒకొక్క డిస్ట్రిబ్యూటర్ కు కనీసం 5 కోట్లు నష్టం వచ్చి ఉండేదని ఈ నష్టాన్ని వారికి తప్పించి కరోనా డిస్ట్రిబ్యూటర్లకు మేలు చేసింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: