ప్రారంభమైన నాగ సౌర్య కొత్త సినిమా...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... నాగ‌శౌర్య హీరోగా `అలా ఎలా?` ఫేమ్ అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఐరా క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 4 గా ఉష ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం ఈ రోజు హైద‌రాబాద్ సంస్థ కార్యాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి సూప‌ర్ ‌సక్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ క్లాప్ నివ్వ‌గా, హీరో నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేశారు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. యంగ్ ప్రొడ్యూస‌ర్ సూర్య‌దేవ‌ర నాగ‌వంశి స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌కుడు అనీష్ కృష్ణకు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ మాజీమంత్రి పి. మ‌హేంద‌ర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు.
చిత్ర నిర్మాత ఉషా ము‌ల్పూరి మాట్లాడుతూ -“అలా ఎలా? ఫేమ్‌ అనీష్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌శౌర్య హీరోగా ఐరా క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్స్ నెం.4 ఈ రోజు ప్రారంభించ‌డం హ్యాపీగా ఉంది. ఈ కోవిడ్ టైమ్‌లో కూడా మా మీద ఉన్న అభిమానంతో మేము పిల‌వ‌గానే ఇక్క‌డికి వ‌చ్చిన కొర‌టాల శివ‌గారికి, అనిల్ రావిపూడి గారికి, నారా రోహిత్‌గారికి, నాగ‌వంశీ గారికి ధ‌న్య‌వాదాలు..
డిసెంబ‌ర్ మొద‌టి వారంనుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నాం. మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం` అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో స‌హ నిర్మాత బుజ్జి, సంగీత ద‌ర్శ‌కుడు మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌, సినిమాటోగ్రాఫ‌ర్ సాయిశ్రీ‌రామ్ త‌దితరులు పాల్గొన్నారు.ఇలాంటి మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: