మాజీ హీరోయిన్లకు డిమాండ్ ఏం రేంజ్ లో ఉందంటే..!

NAGARJUNA NAKKA
సినిమాలో హీరోయిన్  ఎంత గ్లామర్ గా ఉంటుందో వాళ్ల.. మదర్ క్యారెక్టర్ ప్లే చేసేవాళ్లు కూడా అంతే అందంగా ఉండాలనుకుంటారు దర్శకనిర్మాతలు. అందుకే మాజీ హీరోయిన్లకు డిమాండ్ పెరిగిపోతోంది. ఈ డిమాండ్ నే క్యాష్ చేసుకుంటున్నారు నాటి హీరోయిన్ లు.
హీరోయిన్ గా బోల్డంత గ్లామర్ పంచిన నదియా, సపోర్టింగ్ రోల్స్ కు గ్లామర్ కోటింగ్ ఇస్తోంది. మిర్చి సినిమాతో స్టైలిష్ మదర్ గా రీఎంట్రీ ఇచ్చిన నదియాకు అత్తారింటికి దారేది సినిమాతో డిమాండ్ పెరిగిపోయింది. ఈ డిమాండ్ నే ఫుల్ గా క్యాష్ చేసుకుంటోందట నదియా. కీర్తి సురేశ్ మిస్ ఇండియా, వరుణ్ తేజ్ కొత్త సినిమాకు నదియా భారీగా ఛార్జ్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది.
తమిళనాట క్రేజీ ఫాలోయింగ్ ఉన్న ఖుష్బూ తెలుగులో కూడా గ్లామర్ హీరోయిన్ రోల్స్ ప్లే చేసింది. ఇక హీరోయిన్ గా రిటైర్ అయ్యాక సపోర్టింగ్ రోల్స్ కు షిఫ్ట్ అయింది. స్టాలిన్ లో చిరంజీవి అక్కగా నటించిన ఖుష్బూ తర్వాత యమదొంగ, కథానాయకుడు లాంటి సినిమాలు చేసింది. అజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్ మదర్ గా నటించింది ఖుష్బూ. ఇప్పుడు చిరంజీవి ఆచార్యలో కూడా నటిస్తుందని సమాచారం. ఇక ఖుష్బూ.. డే కాల్షీట్స్ కూడా లక్షల్లో ఉంటుందని సమాచారం.
హీరోయిన్ గా రిటైర్ అయ్యాక దాదాపుగా 14ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఇంద్రజ కూడా ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేస్తోంది. దిక్కులు చూడకు రామయ్యతో రీఎంట్రీ ఇచ్చిన ఇంద్రజ శతమానం భవతి, అజ్ఞాతవాసి లాంటి సినిమాల్లో నటించింది. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఇంద్రజ బాగానే సంపాదిస్తోందని సినీజనాలు చెప్పుకుంటున్నారు.
నగ్మా, రాశి లాంటి మాజీ హీరోయిన్ లు కూడా సపోర్టింగ్ రోల్స్ డిమాండ్ ని క్యాష్ చేసుకుంటున్నారు. అల్లరి రాముడు, నిను చూడక నేను ఉండలేను సినిమాల్లో నటించిన నగ్మా.. మళ్లీ తెలుగు సినిమాల్లో నటించేందుకు ఉత్సాహంగా ఉంది. అలాగే స్లిమ్ గా మారిన రాశి కూడా ఈ లుక్ తో భారీ సినిమాల్లో నటించాలనుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: