బాలయ్య వారసుడు తెరంగేట్రం ఎప్పుడో..!
మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ కథలు వింటున్నాడని, డైరెక్టర్లతో మాట్లాడుతున్నాడని ఇలా చాలా వార్తలొచ్చాయి. అయితే ఇప్పటివరకు మోక్షజ్ఞ లాంచింగ్ గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. దీంతో బాలయ్య అభిమానుల్లో కొత్త కొత్త డౌట్స్ వస్తున్నాయి.
జూ.ఎన్టీఆర్ 18 ఏళ్లకే హీరో అయిపోయాడు. ట్వంటీస్‌లో సూపర్ స్టార్డమ్ తెచ్చుకున్నాడు. అయితే మోక్షజ్ఞ 26 ఏళ్లు వచ్చినా ఇంకా తెరపైకి రావడం లేదు. ఫారెన్‌లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేస్తున్నాడని, అయిపోగానే సినిమా అని కొన్నాళ్ల క్రితం ప్రచారం జరిగింది. ఇక లాక్డౌన్లో అయితే బాలకృష్ణ కుమారుడు కోసం కథలు కూడా వింటున్నాడనే మాటలు వినిపించాయి. కానీ అన్‌లాక్ 5.ఓ వచ్చినా వారసుడి లాంచింగ్ గురించి మాట్లాడటం లేదు బాలయ్య.
మోక్షజ్ఞ కరోనా తర్వాతైనా సినిమాల్లోకి వస్తాడా.. లేక తండ్రి పొలిటికల్ వారసత్వాన్ని అందుకొని రాజకీయాల్లోకి వెళ్లిపోతాడా.. బావ లోకేష్‌తో కలిసి పార్టీ బాధ్యతలు చూసుకుంటాడా అని సినీజనాలు కూడా మాట్లాడుకుంటున్నారు. మరి బాలయ్య ఏం ఆలోచిస్తున్నాడు.. కొడుకుని ఎప్పుడు కెమెరా ముందుకు తీసుకొస్తాడు అన్నది తెలియదు గానీ, అభిమానులు మాత్రం మోక్షజ్ఞని తెరపై చూడాలని తెగ ఆరాటపడుతున్నారు.
మొత్తానికి నందమూరి నట సింహం బాలకృష్ణ ఎంట్రీ గురించి ఆయన అభిమానులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. చాలా రోజులుగా మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడని టాక్ వినిపిస్తుందే తప్ప.. అది మాత్రం కార్యరూపం దాల్చలేదు. తన వారసుడి కోసం రకరకాల కథలు బాలయ్య వింటున్నాడని సమాచారం అందుతోంది. ప్రస్తుతం బాలయ్య.. అటు రాజకీయాల్లోనూ.. ఇటు నటుడిగా రాణిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన తనయుడు విదేశాలలో చదువుకుంటున్నాడు.