వ్యక్తిగత ప్రాధాన్యత ముఖ్యం : నటి అనుష్క

Kothuru Ram Kumar
సమాజంలో గౌరవంగా బతుకుతూ.. ఎదుటి వ్యక్తిని ప్రేమగా పలకరించాలి. జీవితంలో వచ్చే ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ప్రతి క్షణాన్ని ఆనందమయం చేసుకోవాలి. జీవితం ఒక గాజు బొమ్మలాంటింది.. జాగ్రత్త కాపాడుకున్నప్పుడు సంతోషం ఉంటుంది. అన్ని మన ఆధీనంలో ఉండాలి.. మనకు నచ్చినట్లే జరగాలి అనుకుంటే కరెక్ట్ కాదు. కష్టాలు, ఆరోపణలు, బాధలను ఓర్చుకుంటూ జీవితాన్ని ముందుకు అడుగువేయడమే జీవితం.’’ అంటూ నటి అనుష్క వెల్లడించింది.
ఇటీవల కాలంలో ఈ మంగళూరు ముద్దుగుమ్మ సామాజిక మాధ్యమం ఖాతా తెరిచారు. ఖాతా తెరిచిన మరుక్షణమే లక్షల మంది ఫాలో అయ్యారు. అయితే ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు నటి అనుష్క సమాధానమిచ్చారు. జీవితంలో ఎదురైన సంఘటనలు, సినిమా ప్రాధాన్యత, జీవితం నేర్పిన పాఠాల గురించి అభిమానులతో పంచుకున్నారు.
అభిమాని: లాక్ డౌన్ టైంలో మీరేం నేర్చుకున్నారు ? అనుష్క: లాక్ డౌన్ లో నేర్చుకోవడానికి పెద్దగా ఏం లేదు. ఇప్పటివరకూ జీవితంలో పశ్చాత్తప పడిన సందర్భం రాలేదు. అంతా కోరుకున్న విధంగానే జరిగింది. కెరీర్ ఈ స్థాయిలో రావడం గొప్ప వరంలా భావిస్తున్నా. అభిమాని: మీరు నటించిన సినిమాల్లో మీకు గుర్తింపు తెచ్చిన సినిమాలు ఏవీ ? అనుష్క: కెరీర్ ప్రారంభంలో సూపర్, అరుంధతి, వేదం, రుద్రమదేవి, భాగమతి, బహుబలి, సైజ్ జీరో, నిశబ్దం వంటి చిత్రాల్లో నటించాను. నా వరకు నాకన్ని మంచి పేరు తెచ్చిన సినిమాలే అన్ని. అన్ని సినిమాలు వ్యక్తిగతంగా సంతృప్తిని ఇచ్చాయి.  అభిమాని: సినిమా ఎంపిక ఎలా చేస్తారు ?
అనుష్క: భాష పరంగా ఎలాంటి ప్రాధామ్యాలు లేవు. సినిమాలో అర్థవంతమైన పాత్ర ఎలాంటిదైనా నటించడానికి నేను సిద్ధం. సినిమాలో నటించే పాత్రను బట్టే గుర్తింపు దొరుకుతుంది. అభిమాని: ప్రభాస్ తో కలిసి మళ్లీ ఎప్పుడు నటిస్తారు ? అనుష్క: ఇద్దరికి సరిపోయే కథ రెడీ అయినప్పుడు తప్పకుండా తెరపై మీరే చూస్తారు. అంటూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు నటి అనుష్క బదులిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: