నెట్టింట్లో వైరల్ అవుతున్న హాట్ యాంకర్ ఆవేదన...

Purushottham Vinay
శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని కన్నడ హాట్ యాంకర్ అనుశ్రీ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను తన ఇన్‌స్గాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు.ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి...
 
డ్రగ్స్ కుంభకోణం కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. ఎప్పడు ఎవరి పేరు బయటికి వస్తుందోనని శాండల్‌వుడ్ సెలబ్రెటీలు వణికిపోతున్నారు. ఇప్పటికే హీరోయిన్లు సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదితో పాటు పలువురిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరికొందరిని విచారించేందుకు నోటీసులు కూడా పంపారు. ఈ క్రమంలోనే ప్రముఖ యాంకర్ అనుశ్రీ పేరు కూడా బయటికి వచ్చింది.

డ్రగ్స్ రవాణా కేసులో డ్యాన్సర్ కిశోర్ శెట్టిని మంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా యాంకర్ అనుశ్రీ పలు పార్టీల్లో డ్రగ్స్ సేవించినట్లు అతడు పోలీసులకు చెప్పాడు. దీంతో సీసీబీ పోలీసులు అనుశ్రీకి నోటీసులు జారీచేశారు. ఈ కేసులో తన పేరు రావడంతో కంగుతిన్న అనుశ్రీ.. విచారణ ఎదుర్కొన్నంత మాత్రాన డ్రగ్స్ కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు కాదని తెలిపారు.

సంబంధం లేని కేసులో తనను అందరూ నేరస్తురాలిగా చూస్తుండటం బాధ కలిగిస్తోందని తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. విచారణలో భాగంగా తనకు తెలిసిన సమాచారాన్ని పోలీసులకు చెప్పానని, తాను ఎలాంటి తప్పు చేయలేదని అనుశ్రీ చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది...
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత బాలీవుడ్ బడా బాబుల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. సుశాంత్ కి మద్దతుగా నెటిజనులు బాలీవుడ్ స్టార్స్ ని, వారి కిడ్స్ ని సోషల్ మీడియా సాక్షిగా ఏకిపడేస్తున్నారు.అసలు ఏం జరిగిందో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో చూడండి.  ఇక పోతే బాలీవుడ్ కేంద్రంగా డ్రగ్స్ కేసు ఎంత సీరియస్ గా నడుస్తుందో తెలిసిందే. డ్రగ్స్ ఆరోపణలపై బాలీవుడ్ లో అరెస్ట్ ల పరంపర కొనసాగుతుంది. సుశాంత్ సింగ్ రాజపుత్ గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ రియా చక్రవర్తి, ఆమె తమ్ముడు షోవిక్ చక్రవర్తిని అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. డ్రగ్ రాకెట్ తో సంబంధం ఉన్న మరో 15మంది వరకు అరెస్ట్ కాబడ్డారు. ఈ కేసు వాడివేడిగా నడుస్తుండగా దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంచరించుకుంది. అసలు బాలీవుడ్ లో ఏమి జరుగుతుందని ప్రజలు మొత్తం ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: