కీర్తి సురేష్ కి బంపర్ ఆఫర్ ఆ బాలీవుడ్ స్టార్ హీరోతో ?

Chaganti
మహానటి సినిమాతో జాతీయ అవార్డు అందుకుని జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ గతంలోనే ఫిక్స్ అయిపోయింది. మైదాన్ టైటిల్ తో దర్శకుడు అమిత్ శర్మ రూపొందిస్తున్న బయోపిక్ సినిమాలో ఆమె జాయిన్ అయింది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ హీరోగా ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ మైదాన్ అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్‌ గా కీర్తి సురేష్‌ ని ఎంపిక చేశారు యూనిట్. అయితే ఏమయిందో కానీ ఈ సినిమా నుండి కీర్తి సురేష్ బయట కొచ్చేసింది. అమిత్ శర్మ డైరెక్ట్ చేస్తు్న్న ఈ సినిమా నుండి కీర్తి సురేష్ వాకౌట్ చేయడానికి ఇప్పటికీ కారణాలు తెలియకున్నా ఇప్పుడు ఆమె మరో బాలీవుడ్ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది.
దర్శకుడు ప్రియదర్శన్ చేయనున్న సినిమాలో ఆమె అక్షయ్ కుమార్ తో కలిసి నటించనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమా కామెడీ జోనర్ లో తెరకెక్కనుందని అంటున్నారు. దీంతో ఈ సినిమా కీర్తికి బాలీవుడ్ డెబ్యూ కానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడాల్సి ఉంది. ఇక కీర్తి ఇప్పుడు వరుస సినిమాలు ఒప్పుకుని బిజీగా ఉంది. మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఇప్పుడు వరుస సినిమాలు ఒప్పుకుని బిజీగా ఉంది. ఈమె మొన్ననే హైదరాబాద్ వచ్చి గుడ్ లక్ సఖి సినిమా ప్యాచ్ వర్క్ అంతా పూర్తి చేసింది.

ఇప్పుడు మరో సినిమా షూట్ కి రెడీ అయినట్టు చెబుతున్నారు. ఈమె రజనీకాంత్ హీరోగా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న తమిళ సినిమా అన్నాత్తేలో నటిస్తోంది. ఈ సినిమా షూట్ అక్టోబర్ నుండి మొదలు పెట్టచ్చని అంటున్నారు. అయితే ఈమె ఈ సినిమా కాకుండా ఆమె మరో రెండు మూడు సినిమాలు చేస్తోంది. ఒకటి నితిన్ రంగ్ దే కాగా, మరొకటి మహేష్ కోనేరు దర్శకత్వం లో మిస్ ఇండియా, మరో సినిమా నగేష్ కుకునూర్ దర్శకత్వం లో చేస్తోంది. ఇప్పటివరకూ ఈ సినిమాలకు వస్తున్న రెస్పాన్స్ ను బట్టి ఈ రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయని ఆమె అభిమానులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: