"లిటిల్ సోల్జర్స్" కావ్య గురించి ఆసక్తికర విషయాలు...

Purushottham Vinay
కొన్ని సినిమాలు ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోతాయి. ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి.‘1996’ లో వచ్చిన ‘లిటిల్ సోల్జర్స్’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. మనకి ‘అమృతం’ వంటి బ్లాక్ బస్టర్ సీరియల్ ను అందించిన నిర్మాత గుణ్ణం గంగరాజు ఈ చిత్రానికి డైరెక్టర్. కోటా శ్రీనివాస రావు, బాలాదిత్య, హీరా .. వంటి వారు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఓ క్లాసిక్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రంలో నటించిన బేబీ కావ్యను కూడా ఎవ్వరూ మరిచిపోలేరు. ఎంతో క్యూట్ గా.. అమాయకపు ఎక్స్ప్రెషన్లతో ప్రేక్షకులను ఈమె బాగా అలరించింది.
ఈ పాపకు అప్పట్లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కేటగిరిలో నేషనల్ అవార్డు కూడా లభించింది. ఈ పాప పూర్తిపేరు కావ్య అన్నపరెడ్డి. ఈమె నిర్మాత మరియు దర్శకుడు అయిన గుణ్ణం గంగరాజు మేనకోడలు అన్న సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. అంతేకాదు హైదరాబాద్ లో చాలా పాపులర్ అయిన డాక్టర్ గురువా రెడ్డి కూతురు.. కావ్య అన్న సంగతి కూడా చాలా మందికి తెలీదు..! 1992 లో జన్మించిన కావ్య… ‘లిటిల్ సోల్జర్స్’ ‘బాలు’ వంటి సినిమాల్లో నటించింది.
ఆ తరువాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పి తన చదువు పైనే దృష్టి పెట్టింది. 2015 లో కుషాల్ అనే వ్యక్తిని ఈమె పెళ్లి చేసుకుంది. కావ్య కూడా డాక్టరే అని ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఈమె విదేశాల్లో ఉంటుందని సమాచారం. ఇక 2015లో జరిగిన కావ్య పెళ్లికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా వాటిని ఓ లుక్కెయ్యండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: