బిబిసి వార్తల్లో రాజమౌళి,రానా

E. Rama Krishna
ఇంటర్నేషనల్ మార్కెట్ లో బిబిసి అంటే ఏమిటో పెద్దగా చెప్పాల్సిందేమి లేదు. ఎందుకంటే బిబిసిలో ఒక న్యూస్ వచ్చిందంటే దానికి అది ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉండిపోతుంది. ఇదిలా ఉంటే, మరో నెల రోజుల్లో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకు చెందిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి పేరు బిబిసి ఛానల్ లో మారు మ్రోగనుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ఇండియన్ సినిమా కొద్ది రోజుల క్రితమే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ వంద సంవత్సరాల వేడుకని అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలు ఘనంగా జరుపుకున్నాయి. ఇండియన్ సినిమా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బిబిసి చానల్ తరపున సంజీవ్ భాస్కర్ ఒక డాక్యుమెంటరీ తీస్తున్నారు. తను తీస్తున్న ఈ డాక్యుమెంటరీలో భాగంగా, తను ‘బాహుబలి’ డైరెక్టర్ రాజమౌళిని, అలాగే రానాని ఇంటర్వ్యూ చేసారు. అంతే కాకుండా వారితో పాటు ఆ చిత్ర టీంలోని చాలా మందిని ఇంటర్వ్యూ చేసారు. ఈ విషయాన్నీ బాహుబలి టీం వారు ట్విట్టర్ లో షేర్ చేసి మరీ చెప్పారు. ‘బిబిసికి చెందిన సంజీవ్ భాస్కర్ 100 సంవత్సరాల ఇండియన్ సినిమా గురించి డాక్యుమెంటరీ చేస్తున్నారు. అందుకోసం ఈ రోజు బాహుబలి డైరెక్టర్ రాజమౌళి, హీరో రానాలతో పాటు పలువురిని ఇంటర్వ్యూ చేసారు’ అంటూ ట్వీట్ చేసారు. దీంతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మైలు రాయిగా మిగలబోతున్న మూవీ బాహుబలి గానూ, అలాగే రేంజ్ లో సౌత్ ఫిల్మ్ ను ఇండియాలో టాప్ పొజిషన్ ను తీసుకుపోవాలని ప్రయత్నిస్తున్న వ్యక్తుల్లో రాజమౌళి ఒకడుగానూ ప్రచారం జరగుతుంది. ఇన్ని ప్రాముఖ్యతలను కలిగి ఉన్నాడు కాబట్టి, రాజమౌళికి చెప్పిన సమాచారాన్ని బిబిసి వారు కచ్ఛితంగా డాక్యుమెంటరీలో పొందుపరుస్తారు. అసలు అందులో రాజమౌళి ఏం చెప్పాడు అనేది, ఆ డాక్యుమెంటరీ విడుదల అయితే కాని తెలియదు. మొత్తానికి రాజమౌళి, బిబిసిలోకి ఎక్కి బాహుబలి మూవీను సైతం బాగానే ప్రమోట్ చేసుకుంటున్నాడని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటుంది. బాహుబలి మూవీ పూర్తైయ్యే సరికి రాజమౌళి ఇలాంటి ఇంటర్వూలను ఎన్ని ఇస్తాడో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: