ఆచార్య కోసం టెస్ట్ షూట్.. చిరు ప్లాన్ బానే ఉందే !

Chaganti
రాజకీయాల్లో వెళ్లి చేతులు కాల్చుకున్న చిరంజీవి కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండి తరువాత ఖైదీ నెం.150తో హిట్ కొట్టాడు. ఆ తరువాత భారీ బడ్జెట్ తీసిన సైరా నరసింహా రెడ్డి సినిమా ను గత ఏడాది అక్టోబర్ లో రిలీజ్ చేసినా అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా అనుకున్నంతగా అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు ఆయన ఆచార్య అనే సినిమాని కొరటాల డైరెక్షన్ లో చేస్తున్నారు. ఈ సినిమా మొదలు పెట్టి కొంత భాగం షూటింగ్ చేసినా, కరోనా లాక్ డౌన్ వలన ఇండస్ట్రీలోని మిగతా సినిమాల మాదిరిగా ఆగిపోయింది. అయితే చిరంజీవే పెద్ద మనిషి హోదాలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి పర్మిషన్స్ తెచ్చుకున్నారు.
అయితే పర్మీషన్స్ వచ్చినప్పటికీ కూడా కరోనా లాక్ డౌన్ సమయం కంటే ఇప్పుడే దారుణంగా కరోనా కేసులు పెరిగిపోతున్న క్రమంలో ఎవరూ షూట్ చేయడానికి సాహసించడం లేదు. అయితే తన కొడుకు నిర్మిస్తోన్న ఆచార్య షూట్ మొదలు పెట్టాలని చిరంజీవి భావించారని అన్నారు.  ఎందుకంటే కొరటాల శివ లాస్ట్ మూవీ భరత్ అనే నేను 2018లో రాగా ఇప్పటికి రెండేళ్ళు పూర్తయి మూడో ఏడాది మొదలు అయ్యింది.  టాప్ డైరెక్టర్ ని ఇన్నాళ్ళు లాక్ చేసి ఉంచడం తప్పని ఆయన షూట్ కి వెళ్దామని అన్నారట.

ఆయన ఆలోచన అలా ఉన్నా కొరటాల మాత్రం ఇప్పట్లో షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో లేరని అంటున్నారు. అయితే ఇంకా ఇంట్లో కూర్చోలేనని చెప్పిన చిరంజీవి కొరటాలని షూట్ చేయమని కోరారట. దసరాకు ముందు ఒక నాలుగు రోజులు టెస్ట్ షూట్ చేద్దమని, అంత మందితో షూట్ కుదురుతుందో లేదో ఈ దెబ్బకు తేలిపోతుందని కోరారట. నాలుగు రోజులు షూట్ చేసి అందరం కరోనా టెస్ట్ చేయించుకుందామని, అలా చేసి సాధ్యాసాధ్యాలు చూద్దామని ఆయన కోరినట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి సింగిల్ షెడ్యూల్ లో మొత్తం షూటింగ్ పూర్తి చేయాలనే ప్లాన్ లో కొరటాల ఉన్నారట. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: