అక్రమాయుధాల కేసులో సల్మాన్ ఖాన్.. మరోసారి కోర్టుకు.. !

SAVIRIGANI MANIKUMAR
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు.. కృష్ణ జింకల వేట, అక్రమ ఆయుధాల కేసులో సమన్లు జారీ చేసింది జోధ్పుర్ కోర్టు. సెప్టెంబరు 28న న్యాయస్థానం ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.
1998లో 'హమ్ సాత్ సాత్ హై' సినిమా షూటింగ్ సందర్భంగా జోధ్పుర్లోని కంకణి గ్రామంలో.. సల్మాన్, సైఫ్ అలీ ఖాన్, సొనాలీ బింద్రే, టబు, నీలమ్.. కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వారిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో లైసెన్స్ లేకుండా ఆయుధాలను కలిగి ఉన్నందున ఆయుధాల చట్టం కింద అక్కడి అటవీ విభాగం సల్మాన్ పై కేసు నమోదు చేసింది. దీనిపై జైలుకు కూడా వెళ్లాడీ నటుడు. ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నాడు.బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్.. 'టైగర్' సిరీస్లో మూడో చిత్రంలో నటించనున్నారు.

ప్రముఖ నిర్మాణసంస్థ యశ్రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తోంది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ను ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తున్నారట. ఇందులో కత్రినా కైఫ్ కథానాయికగా నటించనుంది.  సల్మాన్ ఖాన్.. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో 'రాధే యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ చివరిదశకు చేరుకుంది. హీరోయిన్గా దిశా పటానీ నటిస్తుంది. ఆగస్టు నుంచి చిత్రీకరణను తిరిగి ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ముంబయిలోని మెహబూబ్ స్టూడియోలో షూటింగ్ చేసుకోవడానికి అనుమతి కోరినట్లు సమాచారం.టైగర్' సిరీస్లో మూడో చిత్రానికి బడ్జెట్ రూ.200 కోట్ల నుంచి రూ.225 కోట్ల వరకు ఉంటుంది.

ఇప్పటివరకు వచ్చిన సల్మాన్ సినిమాల్లో ఇదే ఎక్కువ బడ్జెట్. ప్రింట్, పబ్లిసిటీతో కలిపి మరో రూ.25 కోట్లు అవుతుంది. ఇందులో నటించేందుకే సల్మాన్ రూ.100 కోట్లు తీసుకుంటున్నారు. యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థకు 'ధూమ్'తో పాటు 'టైగర్' కూడా అతిపెద్ద ఫ్రాంచైజీనే. వీటి నిర్మాణంలో యశ్రాజ్ అస్సలు రాజీ పడదు. 'టైగర్ 3' కోసం 6-7 దేశాల స్టంట్ నిపుణులు పనిచేయనున్నారు. దర్శకుడు ఆదిత్య చోప్రా, రచయితలతో స్క్రిప్ట్ పనులు పూర్తి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: