థియేటర్స్ ఒపెమింగ్ పై ఓటిటి సంస్థల మడత పేచి !

Seetha Sailaja
కరోనా పరిస్థితులలో అన్నిరంగాలు కుదేలు అవుతున్న స్థితిలో సినిమా ఇండస్ట్రీ కష్టాలు మాత్రం మాటలకు అందని విధంగా ఉంది. ఒక అంచనా ప్రకారం కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి గత ఆరు నెలలుగా ఇండస్ట్రీకి వచ్చిన నష్టం 1500 కోట్ల వరకు ఉంటుంది అని ఒక అంచనా. ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ కాకపోవడంతో అనేకమంది నిర్మాతలు తమ సినిమాల రిలీజ్ కు సంబంధించి ఓటీటీ సంస్థలను ఆశ్రయిస్తున్న పరిస్థుతులలో థియేటర్స్ ఒపెనింగ్ తరువాత ధియేటర్స్ లో సినిమాల రిలీజ్ పై ఓటిటి సంస్థలు పెడుతున్న మడతపేచి ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటి వరకు థియేటర్ లో సినిమాలు విడుదల అయిన నెల తరువాత ఎప్పుడైనా ఓటీటీ  సంస్థలు తాము కోనుక్కున్న సినిమాలను ఆన్ లైన్ లో విడుదలచేసే పద్ధతి కొనసాగింది. అయితే  ఇప్పుడు కరోనా కారణంగా సీన్ రివర్స్ అయింది. ముందు ఓటిటి లోకి సినిమాలు వస్తున్నాయి  ఆఫైన థియేటర్లలోకి రావాల్సిన పరిస్థితి  ఏర్పడింది.

తెలుస్తున్న సమాచారంమేరకు ఒటిటి సంస్థలతో నిర్మాతలు చేసుకుంటున్న అగ్రిమెంట్లో థియేటర్ రిలీజ్ కూడా ఉంటోందని టాక్. అయితే కనీసం వంద రోజుల గ్యాప్ ఉండాలి అనే కండిషన్ ఓటీటీ సంస్థలు పెడుతున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజులలో థియేటర్స్ తెరుచుకున్న వంద రోజుల తరువాత మాత్రమె థియేటర్లలో రిలీజ్ చుకోవాలి అన్న కండిషన్ ఖచ్చితంగా అమలు చేస్తే అన్ని రోజుల తరువాత సినిమాలు థియేటర్స్ లో విడుదల అయినా ఎవరు చూస్తారు అన్న సందేహాలు అనేకమంది నిర్మాతలను వెంటాడు తున్నటు టాక్.  

దీనితో ప్రస్తుత పరిస్థుతలలో మరో రెండు నెలలలో ధియేటర్లు ఓపెన్ అయినా అన్ని సినిమాలు ఓటీటీ లో విడుదల అయితే ఇక జనం చూడటానికి ఇక సినిమాలు ఏముంటాయి అంటూ ధియేటర్ల యజమానులు గగ్గోలు పెడుతున్నట్లు టాక్. ఇలాంటి పరిస్థితులలో సంక్రామ్త్ లోపు ధియేటర్లు తెరుచుకున్నా జనం చూడటానికి మంచి సినిమాలు ఇప్పట్లో విడుదల అయ్యే ఆస్కారం కనిపించడం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: