అక్కడ టాప్ 10లో రెండు ప్రభాస్, రెండు మహేష్ ఖాతాల్లో.....!!

GVK Writings

టాలీవుడ్ హీరోలు సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ ల క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి అనంతరం జాతీయ స్థాయితో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎంతో గొప్ప పేరు గడించిన ప్రభాస్, ఆపై వచ్చిన సాహో సినిమాతో పర్వాలేదనిపించే విజయాన్నే అందుకున్నాడు. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ మూవీ చేస్తోన్న ప్రభాస్, ఆపై నాగ అశ్విన్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేయనున్నారు. ఇటీవల భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాల వరుస సక్సెస్ లతో హ్యాట్రిక్ నమోదు చేసిన సూపర్ స్టార్, అతి త్వరలో తన నెక్స్ట్ మూవీ సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొననున్నారు. 

 

ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, ఇప్పటివరకు రిలీజ్ అయిన టాలీవుడ్ సినిమాలన్నింటిలోకి ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్ ని అందుకున్న టాప్ 10 సినిమాల లిస్ట్ లో రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ వి చెరొక రెండు సినిమాలు చోటు దక్కించుకున్నాయి. కాగా అక్కడి కలెక్షన్ వివరాలు ఇలా ఉన్నాయి.

 

బాహుబలి 2 మూవీ అత్యధికంగా 11.81 మిలియన్ డాలర్ల కలెక్షన్ తో ప్రధమ స్థానంలో నిలవగా, ఆ తరువాత బాహుబలి 6.86 మిలియన్ డాలర్లతో రెండు, అలవైకుంఠపురములో 3.61 మిలియన్ డాలర్లతో మూడు, రంగస్థలం 3.51 మిలియన్ డాలర్లతో నాలుగు, భరత్ అనే నేను 3.42 మిలియన్ డాలర్లతో ఐదు, శ్రీమంతుడు 2.89 మిలియన్ డాలర్లతో ఆరు, మహానటి 2.58 మిలియన్ డాలర్లతో ఏడు, సైరా నరసింహారెడ్డి 2.47 మిలియన్ డాలర్లతో ఎనిమిది, గీతా గోవిందం 2.46 మిలియన్ డాలర్లతో తొమ్మిది, అ ఆ 2.45 మిలియన్ డాలర్లతో పదవ స్థానంలో నిలిచాయి. మొత్తంగా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ ఇద్దరు స్టార్స్ మంచి క్రేజ్, మార్కెట్ తో దూసుకుపోతున్నారని అర్ధమవుతోంది.....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: