రామ్ చరణ్, చిరంజీవిల అడుగుల్లో నడుస్తున్న పవన్ కళ్యాణ్..!

Kothuru Ram Kumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ జీవితం మళ్లీ పునః ప్రారంభం అయ్యింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన వకీల్ సాబ్ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న విరూపాక్ష సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని తెలుస్తోంది. ఈ చారిత్రాత్మక పిరియాడిక్ డ్రామాలో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా మారు వేషం వేసి కనిపించనున్నాడని తెలుస్తోంది. విరూపాక్ష సినిమాలో పవన్ కళ్యాణ్ దొంగ పాత్ర తో పాటు పండుగ సాయన్న అనే చారిత్రక యోధుడు పాత్రలో కూడా నటిస్తున్నాడు.

కొన్ని సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ప్రతి స్టార్ హీరో చారిత్రక యోధుల పాత్రలలో నటించారు. మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించాడు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రామ్ చరణ్ కూడా చారిత్రక యోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. గతంలో రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి అనే చారిత్రక యోధుడు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇలా మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ప్రతి స్టార్ హీరో చారిత్రక యోధుల పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుత నటుడు రామ్ చరణ్ కూడా అద్భుతంగా ఒదిగిపోతాడని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

వీరంతా చారిత్రక యోధుల పాత్రలో నటిస్తుండగా పవన్ కళ్యాణ్ కూడా వారి అడుగులోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తను కూడా విరూపాక్ష సినిమాలో చారిత్రక యోధుడు అయిన పండుగ సాయన్న పాత్రలో నటించబోతున్నాడు. ఏది ఏమైనా చరిత్రలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి ప్రజాదరణ పొందిన రియల్ హీరోలను వెండి తెరపై చూపించడానికి ఎక్కువ పాపులారిటీ కలిగిన మెగాఫ్యామిలీ చేస్తున్న ప్రయత్నాలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మెగా హీరోలు చారిత్రక యోధుల పాత్రలను వేయడం వలన నేటి తరం యువతకు మనం పుట్టిన దేశం కోసం వారు చేసిన సాహసాలు, త్యాగాలు తెలుస్తాయి.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: