తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ సృష్టించి నాచురల్ కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఆ సినిమా..?

praveen

తెలుగు చిత్ర పరిశ్రమలో చాలానే సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులకు ఎప్పుడు గుర్తుండిపోయేలా హవా నడిపిస్తూ ఉంటాయి. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన సినిమాలలో మొదటి వరుసలో ఉంటుంది పెళ్లి చూపులు సినిమా. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది పెళ్లి చూపులు సినిమా. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది అనే చెప్పాలి. అంతేకాదు నాచురల్ కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది పెళ్లిచూపులు సినిమా. 

 


 అంతకుముందు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా లో నాని ఫ్రెండ్ పాత్రలో నటించి ఎంతో మందిని ఆకర్షించిన విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో హీరోగా తన కెరీర్ ప్రారంభించాడు. మొట్ట మొదటి సినిమా అయినప్పటికీ తన కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు విజయ్ దేవరకొండ. ఇక ఈ సినిమాలో  హీరో విజయ్ దేవరకొండ కి స్నేహితుడి పాత్రలో నటించాడు ప్రియదర్శి. అంతేకాకుండా విజయ్ దేవరకొండ కి ఒక గ్యాంగ్  కూడా ఉంటుంది. వీరందరూ ఈ సినిమాలో స్పెషల్ గా కామెడీ డైలాగులు చెప్పరు... సాధారణంగా బయట ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారో  అలాగే మాట్లాడుకుంటారు.

 


 వీరి మధ్య సంభాషణలు ఎంతో నాచురల్ గా ఉంటాయి. స్పెషల్ గా కామెడీ కోసం ఇరికించినట్లుగా ఒక్క డైలాగ్ కూడా ఉండదు. కానీ  సినిమా చూస్తున్న ప్రేక్షకులు మాత్రం సినిమాలోని  ప్రతి డైలాగ్ కి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూనే ఉంటారు. ప్రతి యువకుడు తమ జీవితంలో ఇలాంటి సన్నివేశాలను ఎదుర్కొని ఉంటాడు అని చెప్పవచ్చు. అంతేకాదు ఈ సినిమాలో ఉన్న ప్రతి డైలాగు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో తన ఫ్రెండ్స్ తో చెప్పే ఉంటారు. ఇలా ఎంతో నాచురల్ కామెడీ తో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ ను సృష్టించింది ఈ సినిమా. ఇప్పటికి కూడా పెళ్లి చూపులు సినిమా వస్తుందంటే చూడటానికి ఎంతగానో ఆసక్తి చూపుతుంటారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: