కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సత్తాకి కరోనా ఎఫెక్ట్ ఏమాత్రం ఉండదట ..?

Kunchala Govind

కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత మళ్ళీ అంత క్రేజ్ ఉన్న హీరో "తలపతి" విజయ్. అంతేకాదు ప్రస్తుతం కోలీవుడ్ లో ఉన్న సూపర్ స్టార్ హీరోలలో సూర్య, కార్తి, అజిత్, ధనుష్ కంటే విజయ్ మార్కెట్ ఎక్కువ అన్న విషయం తెలిసిందే. ఎంతమంది పోటీ ఉన్నా విజయ్ కి ఫాన్స్ లో గాని తమిళ ప్రేక్షకుల్లో గాని ఫాలోయింగ్, క్రేజ్ విపరీతం. ఇక తమిళంలో విజయ్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కి పండగ. రజనీకాంత్ సినిమా రిలీజ్ అయితే ఎలాంటి పండగ వాతావరణం నెలకొంటుందో విజయ్ సినిమా రిలీజవుతుంటే కూడా అలాంటి వాతావరణం నెలకొంటుంది.

 

గత రెండు మూడేళ్ళుగా వరస విజయాలతో కోలీవుడ్ లో విజయ్ మార్కెట్ బాగా పెరిగింది. ఆయన నటించిన సినిమాలన్నీ కోలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. ఇక విజయ్ కి కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను మంచి క్రేజ్ ఉందన్న విజయ్ అందరికీ తెలిసిందే. తమిళంలో రిలీజైన సినిమాలు ఇక్కడ కూడా రిలీజై మంచి వసూళ్ళని సాధిస్తున్నాయి. విజయ్ గత చిత్రాలు జిల్లా, పోలీస్, ఏజెంట్ భైరవ, అదిరింది, సర్కార్ గా తెలుగులో డబ్ అయి మంచి సక్సస్ ని అందుకున్నాయి. ఇక్కడ కూడా విజయ్ కి భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. 

 

ఇక విజయ్ తాజాగా నటించిన చిత్రం మాస్టర్. లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహించాడు. మాళవిక మోహన్ హీరోయిన్ గా నటించింది. యాక్షన్ థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా పై తమిళ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ నెలకొంది. ఇప్పటికే 200 కోట్ల బిజినెస్ అయిన ఈ సినిమా ఏప్రిల్ లోనే రిలీజ్ కావాల్సింది. కాని కరోనా నేపథ్యంలో చెన్నై మొత్తం లాక్ డౌన్ విధించారు. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని విజయ్ ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు కొంతమంది ఈ సినిమా కి కరోనా ఎఫెక్ట్ తో భారీగా లాస్ వస్తుందనుకుంటున్నారట. కాని నాలుగు భాషల్లో రిలీజవతుండటం తో పాటు గట్టి కంటెంట్ ఉండటంతో మరోసారి విజయ్ రికార్డ్ సాధించడం ఖాయమని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: