లాక్‌డౌన్ వేళ త్రివిక్ర‌మ్ ది బెస్ట్ సినిమాల‌పై ఓ లుక్కేయాల్సిందే..!!

Kavya Nekkanti

త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌.. ఈయ‌న గురించి, ఈయ‌న సినిమాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రచయితగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన త్రివిక్ర‌మ్‌ దర్శకుడిగానూ సత్తా చాటుతున్నారు. ఇక త్రివిక్రమ్‌ సినిమా అంటే వినోదాలు గ్యారెంటీ అనే భరోసాని ప్రేక్షకుల్లో కనిపిస్తుంటుంది.  తెలుగు సినిమా చరిత్రలో సక్సెస్ కు పెట్టింది పేరు ఆయన. తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న అతడు ఏది మాట్లాడినా ..ఇంకేమి చేసినా ఓ సంచలనమే. అయితే ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ కొన‌సాగుతుంది కాబ‌ట్టి.. ఈ టైమ్‌లో మాట‌ల మాంత్రికుడు తీసిన ది బెస్ట్ 5 సినిమాల‌పై ఖ‌చ్చితంగా ఓ లుక్కేయాల్సిందే.

 

అందులో ముందుగా.. త్రివిక్ర‌మ్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కాంబోలో వ‌చ్చిన చిత్రం `అతడు`.  2005లో విడుదల అయిన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. మ‌హేష్ బాబు ఎన్ని చిత్రాల్లో నటించినా ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ‘అతడు’. పార్థుగా పాత్రలో జీవించడం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మాటలతో మాయ చేయడం ఇందుకు కారణం. బ్రహ్మానందం కామెడీ.. హీరోగా త్రిష అల్ల‌రి చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే. ఇంత‌టి మంచి సినిమాపై లాక్‌డౌన్ వేళ ఓ లుక్కేయాల్సిందే మ‌రి.

 

తివిక్ర‌మ్‌, అల్లు అర్జున్ కాంబోలో వ‌చ్చిన చిత్రం `జులాయి`. ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ మూవీ వీరిద్దరి కెరీర్ లో బెస్ట్ హిట్ గా నిలిచింది అన‌డంతో ఏ మాత్రం సందేహం లేదు. జులాయి సినిమాలో ఇటు రచయితగా ... అటు దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన విశ్వ రూపాన్ని చూపించాడ‌నే చెప్పాలి. ఇలియానా హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో బ‌న్నీ ఎనర్జీ పీక్స్‌లో ఉంటుంది. మ‌రి ఈ సినిమాపై కూడా ఓ లుక్కేసేయండి.

 

తివిక్ర‌మ్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో వ‌చ్చిన చిత్రం `అత్తారింటికి దారేది`. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే 2013కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం. రిలీజ్‌కు ముందు సగం చిత్రం అంతర్జాలంలో విడుదలైననా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. సినిమాకు కథ బలంగా ఉండాలే కానీ ఇలాంటివి ఏం చేయలేవని నిరూపించింది. నిర్మాతలకు కాసులతో పాటు ధైర్యాన్నిచ్చిందీ సినిమా. ఈ సినిమాను మ‌రోసారి చూస్తే.. ఆ ఆనంద‌మే వేర‌ప్పా.

 

త్రివిక్ర‌మ్‌, ఎన్టీఆర్ కాంబోలో వ‌చ్చిన `అరవింద సమేత వీర రాఘవ`. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్‌ తరువాత కూడా మాటల మాంత్రికుడిని నమ్మి అవకాశం ఇచ్చాడు ఎన్టీఆర్. ఆ న‌మ్మ‌కాన్ని ఒమ్ము చేశాడు త్రివిక్ర‌మ్‌. రెగ్యులర్ ఫ్యాక్షన్ సినిమాల్లా కాకుండా త్రివిక్రమ్ స్టైల్లో అరవింద సమేత ను తెరకెక్కించడంతో.. ఈ స‌నిమా సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా నటుడిగానూ ఎన్టీఆర్‌ను సరికొత్తగా ఆవిష్కరిచింది.

 

త్రివిక్ర‌మ్‌, అల్లు అర్జున్ కాంబోలో ఇటీవ‌ల వ‌చ్చిన `అల వైకుంఠ‌పుములో`. ఈ సినిమా ఎంత‌టి స‌క్సెస్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సంక్రాంతి కానుకగా విడులైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర భూకంపాన్ని సృష్టించింది.  ముఖ్యంగా త్రివిక్రమ్ టేకింగ్‌కు అల్లు అర్జున్ నటన తోడై ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్‌లో దూసుకుపోతుంది. మ‌రియు ఈ సినిమాలోని ప్ర‌తి పాట హైలైట్ అని చెప్పుకోవాలి. మ‌రి ఈ లాక్‌డౌన్ టైమ్ ఈ సినిమాపై కూడా ఓ లుక్కేసి ఎంజాయ్ చేయాల్సిందే.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: