షాకింగ్ కేవలం రెండు శుక్రవారాలు 11 గురి మధ్య యుద్ధం !

Seetha Sailaja

ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ ఈ రెండు సినిమాలు కలిపి 250 కోట్ల షేర్ వసూలు చేయడంతో ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీ దశ తిరిగింది అని అనుకున్నారు అంతా. అయితే ఈ ఆనందం కనీసం రెండు నెలలు కూడ మిగలకుండానే కరోనా వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీని అతలాకుతలం చేసేసింది. 

 

ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మూత పడిపోవడంతో పరిస్థితులు అన్నీ జూన్ మొదటి వారానికి కాని సద్దుకోవు అన్నఅంచనాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఉన్న అంచనాల ప్రకారం జూన్ మొదటి వారానికి ధియేటర్లు తెరుచుకుంటే ఆ నెలలో రాబోతున్న మొదటి శుక్రు వారం జూన్ 5వ తారీఖు కోసం ఆ తరువాత వచ్చే రెండవ శుక్రు వారం జూన్ 12 కోసం ఇప్పుడు ఏకంగా 11 సినిమాలు విడుదలకు క్యూ కడుతూ ఇప్పటి నుంచే ఎవరి ప్రయత్నాలు వారు ఈ లాక్ డౌన్ సమయంలో కూడ కొనసాగిస్తూ ఉండటం హాట్ న్యూస్ గా మారింది. 

 

ఇప్పటికే ఈ 11 సినిమాలకు సంబంధించిన నిర్మాతలు ప్రొడ్యూసర్స్ గిల్డ్ తో మాట్లాడుతూ తమకు రిలీజ్ డేట్ లాక్ డౌన్ పిరియడ్ ఇంకా ముగియకుండానే తమ సినిమాలకు రిలీజ్ డేట్ విషయంలో క్లియరెన్స్ ఇమ్మని ఎవరి స్థాయిలో వారు ఇప్పటి నుంచే ఒత్తిడి పెంచుతున్నట్లు టాక్. ఈ లిస్టులో రిలీజ్ సిద్ధంగా ఉన్న ‘వి’ ‘నిశబ్ధం’ ‘ఉప్పెన’ ‘ఒరేయ్ బుజ్జిగా’ ‘30 రోజులలో ప్రేమించడం ఎలా’ సినిమాలతో పాటు ఎడిటింగ్ స్టేజ్ లో ఆగిన ‘లవ్ స్టొరీ’ ‘క్రాక్’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ ‘రొమాంటిక్’ ‘శ్రీకారం’ మూవీ నిర్మాతలు కూడ కనీసం మే 2వ వారం నుండి అయినా షూటింగ్ లు మొదలైతే తమ పెండింగ్ వర్క్ ను పూర్తి చేసుకుని తాము కూడ జూన్ లో విడుదలకు రెడీ అన్న సంకేతాలను ప్రొడ్యూసర్స్ గిల్డ్ కు ఇస్తున్నట్లు సమాచారం.

 

దీనితో సమ్మర్ సీజన్ పూర్తి అయిన తరువాత వచ్చే జూన్ ఏకంగా ఇన్ని సినిమాలకు ఛాన్స్ ఇస్తుందా అన్న సందేహాలు రావడమే కాకుండా అసలు ధియేటర్లు తెరిచినా ప్రేక్షకులు ధియేటర్లలోకి వస్తారో రారో తెలియని పరిస్థితులలో ఈసినిమాల నిర్మాతలు అందరు ఎందుకు ఇలా పగటి కలలు కంటున్నారు అంటూ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నాయకులు ఆశ్చర్య పడుతున్నట్లు టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: