ప్రేమదేశం వినీత్ అబ్బాస్ ల ట్రెండ్ యూత్ కి వైరల్ ఫీవర్ గా పట్టుకోవడానికి కారణం టబు నే ..!

Arshu
ప్రేమ‌దేశం చిత్రం అంద‌రికీ గుర్తు ఉండే ఉంట‌ది. మ‌ర్చిపోవ‌డానికి అది మాములు సినిమా కాదు అప్ప‌ట్లో ఆ చిత్రంలోని పాటలు, క‌థ క‌థనాలు ప్రేక్ష‌కుల‌ని అంత‌లా ఆక‌ట్టుకున్నాయి. ఇక అప్ప‌ట్లో అబ్బాస్‌, వినీత్‌ల హెయిర్ స్టైల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వారిద్ద‌రి హెయిర్‌స్టైల్స్‌ని అప్ప‌ట్లో కుర్రాళ్ళంద‌రూ కూడా అవే చేయించుకునేవారు. పొర‌పాటున ఎవ‌ర‌న్నా మీ హెయిర్ స్టైల్ బావుందే ఎక్క‌డ చెయించారు  అని అడిగితే చాలు ఇదా ఇది అబ్బాస్ స్టైల్ లేదా వినీస్ స్టైల్ అని చెప్పేవారు. అంత‌లా ఆప్పట్లో వాళ్ళ హెయిర్ స్టైల్‌కి క్రేజ్ ఉండేది. ఇక వీరిద్ద‌రు క‌లిసి న‌టించిన చిత్రం ప్రేమ‌దేశం. ఇందులో ట‌బు హీరోయిన్‌గా న‌టించింది.

ఇందులో స్నేహానికి ప్రాముఖ్య‌త‌నిస్తూ ఎంతో అద్భుతంగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు ఖ‌తిర్‌. ట‌బు, వినీత్‌, ప్ర‌భాస్ ల మ‌ధ్య న‌డిచే ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరి అప్ప‌ట్లో ఫుల్ హిట్ అయి క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింద‌నే చెప్పాలి. సినిమాలో ఎక్క‌డా వ‌ల్గారిటీ అనేది లేకుండా చాలా నీట్‌గా చిత్రాన్ని తీశారు. ఇక అందులో ట‌బు చాలా అందంగా ఉంటుంది. త‌ను వేసుకునే డ్ర‌స్సులు అన్నీ కూడా చాలా సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ఉన్న‌ప్ప‌టికీ ఆ చిత్రం ద్వారా త‌న‌కు కూడా చాలా మంచి పేరు వ‌చ్చింద‌ని చెప్పాలి. వీరు ముగ్గురు కూడా యూత్‌ని అంత‌లా ఆక‌ట్టుకున్నార‌నే చెప్పాలి.

ఆ తర్వాత అబ్బాస్‌ మ‌రికొన్ని చిత్రాల్లో న‌టించారు. రాజ‌హంస ఇంకా కొన్ని చిత్రాల్లో న‌టించారు కాని ఆశించినంత హిట్ మాత్రం కాలేక‌పోయారు. ఆ త‌ర్వాత వినీత్ కూడా అదే ప‌రిస్థిని కొన్ని సోలో హీరోగా చేశారు కానీ పెద్ద హిట్ కాలేక‌పోయారు. ఆ త‌ర్వాత కొన్ని కుటుంబ‌క‌థా చిత్రాల్లో సెకండ్ హీరోగా ట్రైచేసి ప‌ర్వాలేద‌నిపించుకున్నారు కాని ప్రేమ‌దేశం చిత్రానికి వ‌చ్చినంత క్రేజ్ మ‌రే చిత్రానికి రాలేదు. ఇక ట‌బు విష‌యం స‌రేస‌రి ఆమె బాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: