పాత్ర కోసం బరువు పెరిగిన మహేష్ హీరోయిన్..!

siri Madhukar

నేనొక్కడినే మూవీతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన భామ కృతిసనన్. ఈ సినిమా హిట్ కాకపోవడంతో.. టాలీవుడ్ లో నిలదొక్కుకోలేక పోయింది. తర్వాత నాగ చైతన్య దోచేయ్ లో అవకాశం వచ్చినా.. పెద్దగా లాభం లేకుండా పోయింది. దాంతో ఇక తెలుగులో లాభం లేదనుకొని బాలీవుడ్ లోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.  తాజాగా ’మిమి’ అనే హిందీ మూవీలో నటిస్తోంది. ఈ మూవీలో కృతిసనన్‌ సరోగేట్‌ మదర్‌ పాత్రలో కనిపించనుంది.  అయితే ఈ సినిమాలో తన పాత్రకు తగ్గట్టుగా కనిపించడం కోసం కృతిసనన్‌ 15 కిలో బరువు పెరిగింది. సినిమాలో వచ్చే ఓ పాట కోసం కృతిసనన్‌ బొద్దుగా, లావుగా కనిపించే పాత్రకు సంబంధించిన సీన్లను షూట్‌ చేశారట.

 

ఈ మద్య సినిమా సినిమాకు వైవిధ్యం ఉండే పాత్రల్లో నటించేందుకు ప్లాన్‌ చేసుకుంటుంది ఢిల్లీ బ్యూటీ. దీనికి సంబంధించిన షూట్‌ పూర్తికావడంతో మళ్లీ కృతిసనన్‌ పెరిగిన బరువును తగ్గించే పనిలో పడినట్లు బాలీవుడ్‌ వర్గాల టాక్‌. నేను మళ్లీ యధావిధిగా మంచి శరీరాకృతిని పొందడానికి కష్టపడుతున్నాను. సాధారణంగా ఆడవారు బరువు పెరిగితే తగ్గడానికి చాలా సమయం పడుతుందటని అంటారు.  గతంలో అనుష్క ‘సైజ్ జీరో’ కోసం బరువు పెరిగి తర్వాత సన్నబడటం కోసం నానా తిప్పలు పడిన విషయం తెలిసిందే.  

 

నాలో శక్తి తగ్గుతున్నా గత కొన్ని రోజుల నుంచి సీరియస్‌గా వర్కవుట్స్‌ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చింది కృతిసనన్‌.2011లో విడుదలై నేషనల్‌ అవార్డు అందుకున్న మరాఠీ చిత్రం ‘మలా ఆయ్‌ వాయ్‌ చి’ కి రీమేక్‌గా మిమి తెరకెక్కుతోంది. 2020 జులైలో  ప్రేక్షకుల ముందుకురానుంది.  ఈ మద్య సినియర్ నటీమణులు ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో కృతి సనన్ తన నటనతో ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: