నేనేం ఓవర్ వెయిట్ కాదంటున్న హీరోయిన్

shami
లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పరిణితి చోప్రా. ఆ సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో ఒక హీరోయిన్ గా చేసి ఆడియెన్స్ ని అలరించిన పరిణితి చోప్రా ఆ తర్వాత ఇషక్ జాదే సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. ప్రియాంక కజిన్ గా ఎంట్రీ ఇచ్చి అదుర్స్ అనిపించుకుంది. చేసింది 3 సినిమాలే అయినా సినిమాలో పరిణితి ఉంది అంటే సూపర్ అనిపించేలా అమ్మడి నటన బీ టౌన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. శుద్ దేసి రొమాన్స్ లో కూడా ఎంతో మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆడియెన్స్ ని మంత్ర ముగ్దుల్ని చేసింది. పరిణితి ప్రస్తుతం చేస్తున్న సినిమా హసి తో ఫసి సిద్దార్ధ్ మల్హోత్రాతో జంటగా నటిస్తున్న ఈ సినిమా వినీల్ మాథ్యూ దర్శకత్వం వహిస్తున్నాడు. కరణ్ జోహార్ , అనురాగ్ కశ్యప్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొబైల్ యాప్ ని రిలీజ్ చేసిన పరిణితి తను డెబ్యూ ఫిల్మ్ నుండి కొద్దిగా బొద్దుగా ఉన్నా ఇప్పుడు స్లిమ్ గానే ఉన్నానని తనని తాను సమర్ధించుకుంది. సో ఏది ఏమైనా క్యారక్టర్ కి 100 పర్సెంట్ న్యాయం చేసే పరిణితి బొద్దుగా ఉన్నా,స్లిమ్ గా ఉన్నా ప్రేక్షకులు అభిమానిచడం మాత్రం ఆపరు కదా అని భావిస్తుంది ఎపిహెరాల్డ్.కామ్. సో అమ్మడిని స్లిమ్ గా కనిపిస్తున్నారు అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు పరిణితి తనని తాను సమర్ధించుకుంటూ కొద్దిగా వెయిట్ లాస్ అయ్యానని చెప్పకనే చెప్పింది. వెయిట్ లాస్ పరిణితి కి కలిసొస్తుందా..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: