కండలు పెంచుతున్న కామసూత్ర బ్యూటీ.. ఆ సినిమా కోసమేనా?

JSR
బాలీవుడ్ లో బోల్డ్ సీన్స్ , క్యారెక్టర్స్ చేసిన అందాల భామ మల్లిక షెరావత్. హాట్‌ గర్ల్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్న మల్లికా కొంత కాలంగా సినిమా కు దూరంగా ఉంది. అయితే సినిమా లకు దూరంగా ఉన్నా సోషల్ మీడియా లో మాత్రం చాలా ఆక్టివ్ గానే ఉంది. తరుచూ  హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తుంది. గతంలో మల్లిక నటించిన కామసూత్ర అప్పట్లో సంచలనం సృష్టించింది.


ప్రస్తుతం ఈ భామ `భూ సబ్‌కీ ఫతేగీ` అనే వెబ్‌ సిరీస్‌ తో పాటు, తమిళ చిత్రం `పాంబాట్టన్‌` లో రాణి పాత్ర నటిస్తోంది. ఈ సినిమాలో యాక్షన్‌ సీన్స్‌లోనూ నటిస్తోంది మల్లికా. అందుకోసం శిక్షణ కూడా తీసుకుంటుంది. ఇటీవల చిత్రదర్శకుడు వడివుడయాన్‌ ముంబై వెళ్లి మల్లికాకు కథ కూడా వినిపించారు. `కథ విన్న వెంటనే ఆమె నటించడానికి ఒప్పుకుంది. ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న రాణి పాత్ర కీలకం. సినిమా మొత్తం ఈ పాత్ర ఉంటుంది` అని దర్శకుడు పేర్కొన్నారు.

గతంలో తమిళంలో కమల్‌హాసన్‌ నటించిన `దశావతారం` (2008)లో మల్లికా ఓ కీలక పాత్ర చేశారు. ఆ తర్వాత దబాంగ్‌ రీమేక్‌ ఓస్తీలో ఐటమ్‌ సాంగ్‌ చేసింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తమిళంలో ఆమె నటించబోతున్న చిత్రం ఇదే కావటం విశేషం. ఈ సినిమాలో ఆమె ఫైట్స్‌ కూడా చేస్తారు. అందుకోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు. ఈ నెలాఖరున మల్లికా పాత్ర చిత్రీకరణ మొదలవుతుంది. ఈ  చిత్రం తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Gym time #tuesdaytransformation #squats #exercise #fitness #fit #squat

A post shared by {{RelevantDataTitle}}