చేసిందేమో ఐదు సినిమాలు.... టెక్కేమో దానికి ఐదు రెట్లు.... అసలు నువ్వు అమ్మాయివేనా...??

GVK Writings

కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన రష్మిక మందన్న, ఆ తర్వాత నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఛలో అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే తొలి సినిమా ఆమెకు మంచి విజయాన్ని అందించి, హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపుని తీసుకువచ్చిది. ఇక ఆ తర్వాత విజయ్ సరసన నటించిన గీతగోవిందంతో మరొక సూపర్ డూపర్ హిట్ కొట్టిన రష్మిక, ఆపై ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేసిన సరిలేరు నీకెవ్వరు అనే మరొక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. 

 

ఇక ప్రస్తుతం రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక, ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన వ్యక్తిగత విషయాలు, అలానే తన ఫోటో షూట్ లో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక నేడు తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో రష్మిక పోస్ట్ చేసిన ఫోటోలు పై పలు మీడియా మాధ్యమాల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇక ఆ ఫోటోల్లో ఒక విషయం తీక్షణంగా గమనిస్తే, రష్మిక తన ఎడమ చేతి పై ఇర్రీప్లేసబుల్ అనే టాటూ వేయించుకుని ఉండడం గమనించవచ్చు. ఇక అదే టాటూ ప్రస్తుతం రష్మిక కు కొంత చేటు చేసింది. 

 

ఆమె చేతి పై ఉన్న టాటూను చూసిన పలువురు నెటిజన్లు, చేసిందేమో ఐదంటే ఐదు సినిమాలు, ఇక ఈ అయిదు సినిమాలకే ఎంతో టెక్కు ప్రదర్శిస్తూ నీకు మరొక హీరోయిన్ రీప్లేస్మెంట్ కాదంటూ నువ్వు ఈ విధంగా టాటూ వేయించుకోవడం సరైనది కాదు అంటూ పలువురు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్ చేస్తున్నారు. అయితే ఆమె టాటూ పై కొందరు ఫ్యాన్స్ ఆమెను సమర్థిస్తూ, తన చేతిపై టాటూ వేయించుకోవడం రష్మిక వ్యక్తిగతమని, ఆమె ఏ ఉద్దేశంతో అలా టాటూ వేయించుకున్నారో మనకు తెలియనప్పుడు, దానిపై ఇష్టం వచ్చినట్లు రాద్దాంతం చేయడం తగదని వారు కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: