అబ్బో నాగశౌర్య కోసం నిహారిక కష్టపడిందా......??

GVK Writings

యువ నటుడు నాగ శౌర్య హీరోగా నూతన దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా అశ్వద్ధామ. శౌర్య సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని శౌర్య తల్లి ఉష మూల్పూరి తన ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కించగా శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించాడు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకడు రూపొందించిన ఈ సినిమాపై తొలి రోజు యావరేజ్ టాక్ లభించింది. నిజానికి ఈ సినిమా కోసం దర్శకుడు ఒక మంచి పాయింట్ ని కథా వస్తువుగా ఎన్నుకున్నప్పటికీ మధ్యలో కొన్ని సీన్స్ లో తడబడ్డాడని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ఇక ఈ సినిమా చూస్తున్నంతసేపు మధ్యలో మనకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన థ్రిల్లర్ మూవీ రాక్షసుడు సినిమా ఛాయలు కొంతవరకు కనపడతాయని, 

 

అయితే ఓవరాల్ గా దర్శకుడు రమణ తేజ సినిమాని బాగానే నడిపించినట్లు చెప్తున్నారు. ఇకపోతే సినిమాకు మంచి స్పందన రావడంతో పాటు గడిచిన మూడు రోజుల్లోనే మొత్తం రూ.10 కోట్ల వరకు కలెక్షన్ ని కొల్లగొట్టడంతో యూనిట్ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా తనకు నచ్చడంతో యూనిట్ సభ్యులకు తమ అభినందనలు తెలిపిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు, హీరో నాగ శౌర్యతో అలానే ఆయనతో ఓ బేబీ సినిమా తీసిన నందిని రెడ్డి తో ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. అయితే ఆ ఇంటర్వ్యూ లో భాగంగా దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ, శౌర్య వాళ్ల అన్నయ్య గౌతమ్‌ అమెరికాలో ఉన్నా కూడా ప్రతి రోజు షూటింగ్‌ ఎలా జరుగుతుందో, అలానే సినిమా ఎలా వస్తుందో ఎప్పటికప్పుడు తెలుసుకునే వాడు. 

 

ఇక ఆన్‌లైన్‌లో ప్రతి విషయాన్ని నిహారిక తోపాటు, ఉషగారితో కూడా కో ఆర్డినేట్‌ చేసేవాడు అంటూ నందిని రెడ్డి మాట్లాడుతున్న సమయంలో శౌర్య గొంతు సవరించుకోవడం, ఆ వెంటనే నందిని రెడ్డి అర్థం చేసుకుని టాపిక్‌ను మార్చేయడం జరిగింది. సో, దీనిని బట్టి వాళ్ళు చెప్తున్న నిహారిక, మెగాబ్రదర్ డాటర్ నిహారిక ఒకరేనేమో అనే అనుమానం ప్రేక్షకులలో కొంతవరకు కలుగుతుంది. ఎందుకంటే గతంలో శౌర్య, నిహారిక కలిసి ఒక మనసు సినిమా చేసారు, అయితే ఆ సమయంలో వారిద్దరూ కలిసి డేటింగ్ లో ఉన్నట్లు కూడా వార్తలు ప్రచారం అయ్యాయి. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా శౌర్య అశ్వద్ధామ విషయంలో నిహారిక నిజంగానే భాగస్వామి అయిందో లేదో అనే దానిపై మాత్రం క్లారిటీ రావలసి ఉంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: