నాగశౌర్య 'అశ్వద్ధామ' ని కాపాడింది అవే....!!

GVK Writings

2011లో వచ్చిన క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ అనే సినిమాతో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పరిచయమైన యువ నటుడు నాగ శౌర్య, ఆ తరువాత శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుస లాడే అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇటీవల ఛలో, ఓ బేబీ సినిమాలతో మంచి విజయాలు అందుకున్న శౌర్య ప్రస్తుతం నటించిన థ్రిల్లింగ్, సస్పెన్స్ యాక్షన్ మూవీ అశ్వద్ధామ. యువ దర్శకుడు రమణ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాగశౌర్య తల్లి ఉష మూల్పూరి, తమ ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. 

 

ఇక ఎన్నో అంచనాల మధ్య మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఓవరాల్ గా పర్వాలేదనిపించే టాక్ దక్కింది. అయితే గతంలో వచ్చిన రాక్షసుడు సినిమా ఛాయలు ఈ సినిమాలో ఉన్నాయని కొందరు ప్రేక్షకులు దీనిపై అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తంగా ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ సినిమా ప్రస్తుతం పర్వాలేదనిపించేలా ముందుకు సాగుతుంది. దాదాపుగా రూ.10 కోట్లకు పైగా ఖర్చుపెట్టిన ఈ సినిమా, క్లోసింగ్ సమయానికి కొంత నష్టాలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే ఈ సినిమాని ఒక్క విషయంలో మాత్రం ఆదుకుంది మాత్రం డిజిటల్ హక్కులతో పాటు డబ్బింగ్ రైట్స్ అని అంటున్నారు. 

 

ఇక ఈ సినిమా డిజిటల్ ప్రసార హక్కులను ప్రముఖ టెలివిజన్ ఛానల్ అయిన జెమినీ టీవీ రూ. 2.5 కోట్లకు దక్కించుకోగా, ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ ని రూ.1.75 కోట్లు ధరకు అమ్మడం జరిగింది. ఈ విధంగా మొత్తం రూ.4.25 కోట్ల పెట్టుబడిని వెనక్కు రాబట్టడం ఒకింత ఆనందించ దాగిన విషయం అని తెలుస్తోంది. శౌర్య సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ ని అందించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంతమేర కలెక్ట్ చేస్తుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: