దెబ్బ దెబ్బకి సూపర్ స్టార్ రెమ్యూనరేషన్ కోట్లలో పడిపోతోంది ..కారణం అదే పాపం...?

Kunchala Govind

గతంలో ఒక స్టార్ హీరో గాని యంగ్ హీరోలు గాని సినిమాకి కమిటయ్యామా డేట్స్ ఇచ్చామా ..సినిమా కంప్లీట్ చేశామా మనం అనుకున్న రెమ్యూనరేషన్ తీసుకున్నామా అంతే అక్కడికే ఆయిపోయోది. కానీ ఎప్పుడైతే సినిమాలో రేమ్యూనరెషన్ తీసుకునే పద్దతి మారిందో అంతే మన స్టార్ హీరోలకి చుక్కలు కనిపిస్తున్నాయి. హిట్ టాక్ వచ్చినా సుఖం ఉండటం లేదు. ఉన్న వాళ్ళు కుదురుగా ఉండక బాలీవుడ్ స్టార్ హీరోలని ఫాలో అవుతున్నారు ..ఢమాల్ అంటూ కింద పడుతున్నారు. ఇప్పుడు మన మహేష్ బాబు పరిస్థితి కూడా అలానే అనిపిస్తుంది. వాస్తవంగా మన టాలీవుడ్ లో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. 

 

ఆయన ఈమధ్య చేసిన మూడు సినిమాలకు గానూ తన రెమ్యూనరేషన్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ అందుకున్నారని ఫిల్మ్ నగర్ లో నడుస్తున్న టాక్. ఈ మూడు సినిమాలకు గాను రెమ్యూనరేషన్ మొత్తం రూ.150 కోట్లు అని చెపుకుంటున్నారు. ఈ మేరకు మహేష్ చెక్ కూడా అందుకున్నారని సమాచారం. అయితే మొదటి సినిమాకు ఒక్క దానికే రెమ్యూనరేషన్ కాస్త బాగానే వర్క్ అవుట్ అయిందట. 'మహర్షి'.. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాల విషయంలో మాత్రం దెబ్బపడిందని తాజాగా వార్తలు వస్తున్నాయి.

 

'మహర్షి'.. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలకు దాదాపు రూ. 25 కోట్లు తగ్గిందని తాజాగా వార్తల సారాంశం.  'మహర్షి' నాన్ థియేట్రికల్ రైట్స్ రూ. 35 కోట్లకు క్లోజ్ కావడంతో అక్కడ 15 కోట్ల రూపాయలు మహేష్ రెమ్యూనరేషన్ తక్కువ వచ్చిందని అంటున్నారు. దీంతో ఆ 15 కోట్లు వెనక్కు ఇవ్వాల్సి వచ్చిందట. ఇక 'సరిలేరు నీకెవ్వరు' నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ రూ. 40 కోట్లకే క్లోజ్ అయిందట. ఇక్కడ కూడా 'సరిలేరు నీకేవ్వరు' రెమ్యూనరేషన్ పది కోట్లు తగ్గిందని అంటున్నారు. అందుకే ఈ పది కోట్లు వెనక్కు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతోంది.

 

ఈలెక్కన మూడు సినిమాలకు మహేష్ రెమ్యూనరేషన్ ముందుగా అనుకున్న దానికంటే రూ. 25 కోట్లు తగ్గిందని టాక్ నడుస్తోంది. శాటిలైట్ రైట్స్.. డిజిటల్ రైట్స్.. హిందీ డబ్బింగ్ రైట్స్ కు గతంలో భారీ డిమాండ్ ఉండేది. అక్కడి ఫిల్మ్ మేకర్స్ ఒకరుని మించి ఒకరు పోటీ పడి మరీ మన సినిమాలను కొనేవారు. కానీ ఇప్పుడు వాటికి డిమాండ్ తగ్గడంతోనే మహేష్ రెమ్యూనరేషన్ తగ్గిందని అంటున్నారు. మరి భవిష్యత్తులో కూడా మహేష్ ఇదే రెమ్యూనరేషన్ పద్దతిని మారుస్తారో లేదా ముందున్న పద్దతికి వచ్చేస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: