రచ్చ లేపుతున్న రవి తేజ.. ఈ సారి హిట్ కన్ఫర్మ్ అట..

Satvika

చాలా కాలం నుండి వరుస ప్లాప్ సినిమాల తో రాణిస్తున్న రవితేజ కు ఏడాది నుండి ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు.. అందుకే ఈ సారి కొంచెం లెట్ అయిన పర్వా లేదని అనుకున్న యితగాడు భారీ బడ్జెట్ సినిమా లో నటిస్తున్నారు.. ఆ సినిమానే డిస్కో రాజా..వి ఐ ఆనంద్ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందుతుంద.. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 24న ప్రేక్షకులను రాబోతుంది..

 

అయితే..పదేళ్ల క్రితం ‘కిక్’ సినిమా తో తెలుగు ప్రేక్షకు లకు మంచి కిక్ ఇచ్చారు రవితేజ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తరవాత మళ్లీ అంతటి హిట్‌ను అందు కోలేదు రవితేజ. ‘కిక్’ తరవాత 2015 వరకు 13 సినిమాలు చేశారు రవితేజ. వీటిలో డిజాస్టర్లే ఎక్కువ. ‘బలుపు’, ‘పవర్’, ‘బెంగాల్ టైగర్’ సినిమాలు పర్వాలేదనిపించినా రవితేజ మార్కెట్‌ను పెంచు కోలేకపోయాయి.

 

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు తమన్ సంగీత సారథ్యం లో పాటలు, నేపథ్య సంగీతం పనులు పూర్తిచేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘నువ్వు నాతో ఎమన్నావో’, ‘ఢిల్లీవాలా’ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టకున్నాయి. టీజర్, పాటలు అద్భుతంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ అంచనాలను మరింత పెంచేలా సినిమా ప్రమోషన్స్ కూడా ఉన్నాయి.

 

స్టేట్ రౌడీ’, ‘గ్యాంగ్ లీడర్’, ‘రౌడీ అల్లుడు’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’, ‘నిప్పురవ్వ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీలహరి. ఈ సినిమాలో ఓ మాస్ సాంగ్ ను చిత్రబృందం పాడించారు.. ఆ పాట ఈ రోజు సాయంత్రం విడుదల కానుంది..అలాగే జనవరి 19న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు..

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: