తల్లి, పిన తండ్రి వేధింపులు తాళ్లలేక పారిపోయిన హీరోయిన్

Satvika

సినిమా తెరకెక్కుతున్న సమయం లోనే డబ్బులు మొత్తం తీసుకొని ఏటో పారిపోయిందనే ఆరోపణలు ఎదుర్కొటున్న కన్నడ హీరోయిన్ విజయలక్ష్మి.  మొత్తాని కి దొరికింది. సినిమా జరుగుతుండ గానే పారిపోయిన ఈ అమ్మడు రాయచూరు లో ప్రత్యక్షమయ్యారు. అయితే ఆమె ఒక్కటే వెళ్ళలేదు. తన కూడా తన మాజీ భర్తను తోడుగా తీసుకెళ్లింది. 


 విషయాని కొస్తే.. భర్త ఆంజినేయ తో కలిసి రాయచూరు లో ప్రత్యక్షమైంది. గురువారం సిరవార తాలూకా హళ్లిహొసూరులో విలేకర్లతో ఆమె ఈ విషయం పై మాట్లాడారు. తుంగభద్ర సినిమా షూటింగ్‌ సమయంలో సహాయ డైరెక్టర్‌ ఆంజినేయను ప్రేమించానని తెలిపారు. ఆంజినేయ, తాను గంగావతిలో పెళ్లి చేసుకున్నామని తెలిపారు. ఇది నచ్చక తన అవ్వ, అమ్మ విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారని వార్తలు వచ్చాయని దానిని వదిలించుకొని ఇంట్లో నుండి వెళ్లిపోయానని చెప్పారు. 

 

నాకు ఈ విషయం లో ఎటువంటి ప్రమేయం లేక పోయినా కూడా అందరు తనపై నిందలు వేయడం నచ్చకే వెళ్లిపోయానని ఆమె అన్నారు. నిజానికి తన అవ్వ చని పోలేదని, తల్లి సవితా డ్రామా లాడుతోందని ఆమె మండిపడ్డారు. ఇది ఇలా ఉండగా తన తల్లిదండ్రులు విడిపోయిన విషయాన్నీ తెలియజేసింది. ఆరేళ్లు కావస్తోందన్నారు. తల్లి, పెంచిన తండ్రి పెడుతున్న బాధలు తట్టు కోలేకపోయా నన్నారు. 


తన భర్తను చంపడానికి కూడా వారు కుట్ర చేశారని ఆమె ఆరోపించారు. తాను రాయచూరుకు వస్తున్న సమయం లో తాను ఎవరి వద్ద డబ్బు, బంగారు తీసుకో లేదని, తమ పెద్దలకు డబ్బు  సంపాదించి పెట్టాలి తప్ప, తాను పెళ్లి చేసుకోరాదన ని వారు కోరుకున్నార ని ఆవేదన చెందారు. జిల్లా ఎస్పీ వేదమూర్తిని కలిసి తమకు రక్షణ కల్పించాలని విన్నవించినట్లు ఆమె తెలిపారు. దీంతో ఆమె అదృశ్యం మిస్టరీ మొత్తానికి వీడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: