కాపీ సినిమాని ఆస్కార్ కి ఎలా పంపిస్తారు....?

Pranateja Sriram


ణ్వీర్ సింగ్, ఆలియా భ‌ట్ జంట‌గా జోయా అక్తర్‌ తెరకెక్కించిన హిందీ సినిమా 'గల్లీ బాయ్‌' చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు మంచి కలెక్షన్లను సాధించింది. అయితే ఈ సినిమాని ఇండియా తరపున ఆస్కార్ కి పంపారు. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ రేసు నుంచి త‌ప్పుకుంది. ఆస్కార్ అవార్డుల్లో ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ కింద పోటీ ప‌డ్డ 91 చిత్రాల్లో  చివరకు కేవలం 10 మాత్రమే ఆస్కార్‌ బరిలో నిలిచాయి. అందులో గ‌ల్లీ బాయ్‌కు స్థానం ద‌క్క‌లేదు.

 


అయితే ఈ సినిమాపై కంగనా రనౌత్ సోదరి రంగోలి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఫైర్ బ్రాండ్ గా పేరుంది. బాలివుడ్ లో చాలా మందితో ఆమెకు విభేధాలున్నాయి. ఆమె స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్స్  ఇలా అందరిపై కూడా తన మనసులో ఉన్న మాటలు చెబుతూ విమర్శల చేసిన సందర్బాలు చాలా ఉన్నాయి. కంగనా దారిలోనే ఆమె సోదరి రంగోలీ కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఉంటుంది.

 

వారసత్వంతో వచ్చిన స్టార్స్ పై పదే పదే వ్యాక్యలు చేస్తున్న రంగోలీ ఈసారి ఆస్కార్ ఎంట్రీస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. గ‌ల్లీబాయ్ కాపీ సినిమా అని, అలాంటి కాపి సినిమాని ఆస్కార్ కి ఎలా పంపిస్తారని ప్రశ్నించింది. కాపీ సినిమా కాబట్టే ఆ సినిమాకి ఆస్కార్‌లో ఎంట్రీ ల‌భించ‌లేద‌ని ఆమె విమ‌ర్శించింది. హాలీవుడ్‌ సినిమా ‘8 మైల్‌’ ఆధారంగా ‘గల్లీబాయ్‌’ను తీశారని, అలాంటి చిత్రాన్ని ఎంట్రీకి ఎలా పంపారని రంగోలి ప్ర‌శ్నించింది.

 

ఒరిజినల్‌ కంటెంట్‌ ఉన్న ‘ఉరి’, ‘మణికర్ణిక’ లాంటి సినిమాల్ని పంపకుండా, కాపీ సినిమా అయిన గల్లీ బాయ్ ని ఆస్కార్ కి పంపడం కరెక్ట్ కాదని అంటోంది. మరి రంగోలి వ్యాఖ్యలపై ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. మరి బాలీవుడ్ హీరోలు ఈ విషయమై ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: